ఎక్కువ కాలం ఒంటరిగానే స్టార్ హీరోయిన్
పెళ్లికి సంబంధించిన ఊహాగానాల నేపథ్యంలో రకుల్ తాజాగా జాతీయ మీడియాకు వివరణ ఇచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానితో తన రిలేషన్ గురించి ఓపెన్ చేసింది. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెనైంది.
బాలీవుడ్లో ప్రేమ జంటల పబ్లిక్ షికార్లు మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్. ఇటీవల తమ ప్రేమను అధికారికం చేసిన రకుల్ ప్రీత్ సింగ్ -జాకీ భగ్నానీ ఈవెంట్లు, పార్టీలు లేదా ఔటింగుల్లో తమ మధ్య ఉన్న అపరిమిత ప్రేమను బహిరంగంగా ప్రదర్శిస్తారు. రెండు సంవత్సరాలకు పైగా వారి బంధం కొనసాగింది. ఈ జంట ఇప్పుడు తమ సంబంధాన్ని తదుపరి దశకు ఎలివేట్ చేయడానికి సిద్ధమవుతున్నారని, త్వరలోనే పెళ్లికి రెడీ అవుతున్నారని ప్రచారం సాగుతోంది.
మీడియా కథనాల ప్రకారం, రకుల్ -జాకీ 22 ఫిబ్రవరి 2024న గోవాలోని సుందరమైన లొకేషన్ లో పెళ్లి చేసుకోబోతున్నారని పుకార్లు వస్తున్నాయి. పెళ్లికి సంబంధించిన ఊహాగానాల నేపథ్యంలో రకుల్ తాజాగా జాతీయ మీడియాకు వివరణ ఇచ్చింది. రకుల్ ప్రీత్ సింగ్ జాకీ భగ్నానితో తన రిలేషన్ గురించి ఓపెన్ చేసింది. ముఖ్యంగా తన వ్యక్తిగత జీవితం గురించి ఓపెనైంది. "నేను చాలా కాలం పాటు ఒంటరిగా ఉన్నాను, కానీ భాగస్వామిని కలిగి ఉండటం చాలా సహజమైన ప్రక్రియ. దురదృష్టవశాత్తు సినీరంగానికి చెందిన వారైతే చాలా ఊహాగానాలు సాగుతుంటాయి. కానీ ప్రధానంగా మనమందరం మనుషులం. భావోద్వేగాలకు తగ్గట్టు స్పందిస్తాం" అని అన్నారు.
ఆసక్తికరంగా వారిద్దరూ ఒకే పరిశ్రమకు చెందినవారు కాబట్టి తన వృత్తి గురించి జాకీ అవగాహనను రకుల్ మెచ్చుకుంది. ఈ భాగస్వామ్య అవగాహన ఇతరుల అసూయకు కారణమవుతుంది. తాము భావోద్వేగ సమతౌల్యం నిర్వహిస్తామని, వృత్తిపరమైన ప్రయత్నాలను గణనీయంగా ప్రభావితం చేసే అంశమిదని తెలిపింది. అంతేకాకుండా తమ మధ్య సంభాషణలు ఎప్పుడూ పని చుట్టూ తిరగవని రకుల్ వెల్లడించింది. అంకితమైన వర్క్హోలిక్లు ఫిట్నెస్ ఔత్సాహికులు అయిన ఆ ఇద్దరూ.. తరచుగా వర్కౌట్లు, ఆహారం, ఆరోగ్యం.. ఫిట్నెస్ గురించి చర్చల్లో పాల్గొంటారు. పన్నెండు గంటల పనిదినాలతో ఒత్తిడి ఉన్నా కానీ, సంబంధాన్ని కాపాడుకోవడానికి ఉద్దేశపూర్వకంగా పనికి సంబంధించిన చర్చలను వదిలిపెట్టి ప్రతిరోజూ ఒకరికోసం ఒకరు ఒక గంట సమయాన్ని కేటాయించుకుంటారు. వారు కలిసి ఏదైనా పని చేయడానికి ఇష్టపడతారు. ఇతర సాధారణ జంటల వలె ఉండటానికి ప్రయత్నిస్తారు.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. జాకీ భగ్నాని పలు భారీ ప్రాజెక్ట్‌లలో నిర్మాతగా చురుకుగా ఉన్నారు. ముఖ్యంగా బడే మియాన్ చోటే మియాన్ .. షాహిద్ కపూర్ తో సినిమా చిత్రీకరణలో ఉన్నాయి. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ కమల్ హాసన్, అజయ్ దేవగన్, అర్జున్ కపూర్లతో వరుస చిత్రాలలో బిజీగా ఉన్నారు. కమల్ తో భారతీయుడు 2 ఈ ఏడాది విడుదల కానుంది.