ఆర్సీ 16 రేపటి నుంచి నైట్ షూట్!
అలాగే సినిమాకి అవసరమైన సెట్స్ కొన్నింటిని రామోజీ ఫిలిం సిటీ సహా హైదరాబాద్ శివార్లలో నిర్మించారు. ఈ షెడ్యూల్ అనంతరం కంటున్యూటీగా ఆయా సెట్లలోనూ షూటింగ్ ఉంటుం దని తెలుస్తోంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 16వ చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న స్పోర్స్ట్ డ్రామా ఇది . రామ్ చరణ్ పవర్ పుల్ యాక్షన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే రెండు షెడ్యూళ్ల షూటింగ్ పూర్తయింది. ఇందులో చరణ్ , జాన్వీక పూర్ సహా ప్రధాన తారగణంపై కీలకమైన సన్నివేశాలు చిత్రీకరించారు. రెండు రా పుటేజీలు చూసిన తర్వాత దర్శకుడు సుకుమార్ థ్రిల్ అయ్యారు.
సన్నివేశాలు ఎంతో గొప్పగా వచ్చాయని శిష్యుడు బుచ్చిబాబుని ప్రశసించారు. థ్రిల్లింగ్ అంశాలు ప్రేక్షకుల్ని ఎగ్జైట్ మెంట్ కు గురి చేసేలా ఉన్నాయని కితాబిచ్చారు. తాజాగా మూడవ షెడ్యూల్ బుధవారం నుంచి హైదరాబాద్ లో మొదలవుతుంది. అయితే ఈ షెడ్యూల్ అంతా నైట్ ప్లాన్ చేసారుట. దీనిలో భాగంగా నైట్ సన్నివేశాల చిత్రీకరణ ఉంటుందని తెలుస్తోంది. ఇందులో చరణ్ పై కొన్ని సోలో సన్నివేశాలు...అలాగే ఇతర నటులతో కొన్ని కాంబినేషన్ సన్నివేశాలు చిత్రీకరిస్తారని సమాచారం.
దీనికోసం ప్రత్యేకంగా ఓ సెట్ ని సిద్దం చేసారుట. ఈ నైట్ సన్నివేశాలు సినిమాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అలాగే సినిమాకి అవసరమైన సెట్స్ కొన్నింటిని రామోజీ ఫిలిం సిటీ సహా హైదరాబాద్ శివార్లలో నిర్మించారు. ఈ షెడ్యూల్ అనంతరం కంటున్యూటీగా ఆయా సెట్లలోనూ షూటింగ్ ఉంటుం దని తెలుస్తోంది. ఈ సినిమా విజయం కూడా చరణ్ కి కీలకం. ఇటీవల రిలీజ్ అయిన 'గేమ్ ఛేంజర్' భారీ అంచనాల మధ్య వచ్చినా? వాటిని అందుకోవడంలో విఫలమైంది.
దీంతో చరణ్ ఇంకా సోలో పాన్ ఇండియా సక్సెస్ కి దూరంలోనే ఉన్నాడు. స్నేహితుడు తారక్ మాత్రం 'దేవర'తో డివైడ్ టాక్ తో బయట పట్టాడు. ఇద్దరి కాంబినేషన్ లో రిలీజ్ అయిన ' ఆర్ ఆర్ ఆర్' పాన్ ఇండియాలో సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే.