కియారా, అలియాభ‌ట్ ముందున్నా చ‌ర‌ణ్ ఆప్ష‌న్ స‌మంత‌!

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమాన హీరోయిన్ ఎవ‌రు అంటే? ఓ సంద‌ర్భంలో కాస్త ఆలోచించి ఎలా చెప్ప‌గ‌లం.

Update: 2025-01-07 07:09 GMT

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమాన హీరోయిన్ ఎవ‌రు అంటే? ఓ సంద‌ర్భంలో కాస్త ఆలోచించి ఎలా చెప్ప‌గ‌లం. ఒకరి పేరు చెబితే మ‌రొక‌రు ఫీల‌వుతారు? అన్న‌ట్లు ఓ ఎక్స్ ప్రెష‌న్ ఇచ్చి కాస్త ఆలోచించి ఈజ‌న‌రేష‌న్ లో చూస్తే స‌మంత అన్నారు. అప్పటి నుంచి రామ్ చ‌ర‌ణ్ అభిమానించే హీరోయిన్ ఎవ‌రు? అంటే అంతా ట‌క్కున చెప్పేది స‌మంత పేరు మాత్ర‌మే. ఇద్ద‌రు జంటగా `రంగ‌స్థ‌లం`లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.

ఆ కాంబినేష‌న్ వెండి తెర‌పై ఎంతో అందంగా, అద్భుతంగా పండింది. ఇంకా చ‌ర‌ణ్ కెరీర్ లో చాలా మంది హీరోయిన్ల‌తో క‌లిసి న‌టించాడు. ఇప్ప‌టి వర‌కూ అత‌డు చేసిన సినిమాలు 15. `గేమ్ ఛేంజ‌ర్` తో క‌లిపి. మొత్తంగా చూసుకుంటే 15 మందికి పైగా హీరోయిన్లు ఆయ‌న‌తో న‌టించి ఉండొచ్చు. వీళ్ల‌లో కొంత మంది హీరోయిన్లు చ‌ర‌ణ్ తో మంచి స్నేహాన్ని కొన‌సాగిస్తున్నారు ఇప్ప‌టికీ. అందులో స‌మంత కూడా ఒక‌రు. త‌మ‌న్నా, కాజ‌ల్ అగ‌ర్వాల్ కూడా ఉన్నారు.

మ‌రి మీతో న‌టించిన హీరోయిన్లో ఉత్త‌మ న‌టి ఎవ‌రు? అంటే చ‌ర‌ణ్ మ‌రోసారి స‌ర్ ప్రైజ్ చేసాడు. చ‌ర‌ణ్ ముందు కియారా అద్వాణీ, అలియాభ‌ట్ పేర్లు కూడా ఉంచారు. కానీ చ‌ర‌ణ్ ఎవ‌రి పేరు చెప్పారో తెలుసా? తాను మెచ్చిన ఉత్త‌మ న‌టి స‌మంత మాత్ర‌మే అన్నారు. దీంతో స‌మంత పేరు మ‌రోసారి హైలైట్ అయింది. `ఆర్ ఆర్ ఆర్` చిత్రంలో అలియాభ‌ట్ తో క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే.

చేసింది ఒక్క సినిమా అయినా చ‌ర‌ణ్ కి మంచి స్నేహితురాలిగా మారిపోయింది అలియాభ‌ట్. ఇక కియారా సంగ‌తి చూస్తే ఇప్ప‌టికే చ‌ర‌ణ్ తో రెండు సినిమాల్లో న‌టించింది. `విన‌య విధేయ రామ‌`లో, `గేమ్ ఛేంజ‌ర్` లోనూ న‌టిం చింది. ఆ ర‌కంగా కియారాతోనూ చ‌ర‌ణ్ కి మంచి స్నేహం ఉంది. కానీ చ‌ర‌ణ్ దృష్టిలో తాను అభిమానించే తార‌, ఉత్త‌మ న‌టి ఎవ‌రు? అంటే అది క‌చ్చితంగా స‌మంత మాత్ర‌మే. అందులో ఎలాంటి సందేహం లేదు. మోహ‌మాటం లేదు సుమీ.

Tags:    

Similar News