'ఆహా' అన్‌స్టాపబుల్‌ షోలో చరణ్‌ గొప్పతనం చెప్పిన ఫ్యాన్‌

తాజాగా మరోసారి రామ్‌ చరణ్ మంచి మనసు, ఆయన దాతృత్వం గురించి, ఫ్యాన్స్‌ పట్ల ఆయనకు ఉండే ఇష్టం గురించి చర్చ జరుగుతోంది.

Update: 2025-01-18 08:07 GMT

మెగాస్టార్ చిరంజీవి దయాగుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎంతో మందికి తన సహాయం, సహకారం అందించిన చిరంజీవి ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి సహాయం చేసిన విషయం తెల్సిందే. ఆయన వారసుడు రామ్‌ చరణ్ సైతం అదే దారిలో నడుస్తూ ఉంటారు. చరణ్‌ చారిటీ గురించి రెగ్యులర్‌గా మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. సోషల్‌ మీడియా ద్వారా రామ్‌ చరణ్ చేస్తున్న దాతృత్వం గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా మరోసారి రామ్‌ చరణ్ మంచి మనసు, ఆయన దాతృత్వం గురించి, ఫ్యాన్స్‌ పట్ల ఆయనకు ఉండే ఇష్టం గురించి చర్చ జరుగుతోంది.

 

గేమ్‌ ఛేంజర్ సినిమా ప్రమోషన్‌లో భాగంగా రామ్‌ చరణ్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న బాలకృష్ణ అన్‌ స్టాపబుల్‌ టాక్‌ షోలో పాల్గొన్నారు. రామ్‌ చరణ్ గెస్ట్‌గా హాజరు అయిన ఎపిసోడ్‌ను ఆహా ఓటీటీ వారు రెండు ఎపిసోడ్స్‌గా స్ట్రీమింగ్ చేశారు. బాలకృష్ణ అన్‌ స్టాపబుల్‌ సీజన్‌ 4లో రామ్‌ చరణ్ ఎపిసోడ్స్‌ ప్రత్యేకంగా నిలిచాయి. ఆహా ద్వారా ఎంతో మంది రామ్‌ చరణ్, బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ రెండు ఎపిసోడ్స్‌ను చూశారు. ఆహాలో తాజాగా స్ట్రీమింగ్‌ అవుతున్న రెండో పార్ట్‌ ఎపిసోడ్‌లో ఒక అభిమాని తన అనుభవంను వివరిస్తూ రామ్‌ చరణ్ గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు.

 

మెగా ఫ్యాన్‌ అభిమాని ఒకరు ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్న రామ్‌ చరణ్ వెంటనే స్పందించారు. అభిమాని భార్య తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుందని తెలుసుకుని వెంటనే ఉపాసనతో మాట్లాడి అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేయించారు. ఉపాసన, రామ్‌ చరణ్ గారి ఆదేశాలతో అపోలో ఆసుపత్రిలో 17 రోజుల పాటు నిపుణుల సంరక్షణలో అభిమాని భార్యకి ఐసీయూలో చికిత్స అందించారు. మొదట అతడు డబ్బు విషయంలో ఆందోళన చెందాడట. ఆసుపత్రి బిల్లు చెల్లించే విషయమై టెన్షన్‌ పడుతుండగా, ఒక్క రూపాయి కూడా కట్టనక్కర్లేదని ఆసుపత్రి వారు అతనికి చెప్పారట.

అంతే కాకుండా ఆసుపత్రి నుంచి ఆమె పూర్తిగా మెరుగైన తర్వాత డిశ్చార్జ్‌ చేసి వారి ఆంబులెన్స్‌లోనే ఇంటికి చేర్చారట. ఈ విషయాన్ని సదరు అభిమాని ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4 చరణ్ ఎపిసోడ్‌ పార్ట్‌ 2 లో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ విషయాన్ని మెగా ఫ్యాన్స్ సోషల్‌ మీడియా ద్వారా ప్రముఖంగా షేర్ చేస్తున్నారు. రామ్‌ చరణ్ గొప్ప మనసు గురించి ఎంత చెప్పినా తక్కువే అని, ఆయనకు తగ్గట్లుగా ఉపాసన గొప్ప మనసున్న వ్యక్తి అంటూ మెగా ఫ్యాన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్‌ అవుతున్న అన్‌స్టాపబుల్‌ సీజన్‌ 4 ఎపిసోడ్స్‌ అన్నింటికి మంచి స్పందన దక్కింది. చరణ్ ఎపిసోడ్స్‌ రెండూ అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకున్నట్లు ఆహా ఓటీటీ టీం మెంబర్స్ చెప్పుకొచ్చారు.

Tags:    

Similar News