మాస్ బీట్ తో 'రా మచ్చా మచ్చా'.. చరణ్ స్టెప్పులు అదుర్స్

బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-09-28 14:29 GMT

బ్లాక్ బస్టర్ హిట్ ఆర్ఆర్ఆర్ తర్వాత టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ చేస్తున్న గేమ్ ఛేంజర్ మూవీ కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో మూవీ రూపొందుతోంది. భారీ బ‌డ్జెట్‌ తో శ్రీ వెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. 2024 క్రిస్మస్ కానుకగా డిసెంబర్ లో మూవీని ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కానున్న గేమ్ ఛేంజర్ మూవీ నుంచి అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే జరగండి సాంగ్ ను రిలీజ్ చేసిన మేకర్స్.. రెండో సింగిల్ రా మచ్చా మచ్చాను విడుదల చేయనున్నట్లు కొన్నిరోజులుగా ఊరిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్, శంకర్ ఇంటరాక్షన్ వీడియోను రీసెంట్ గా షేర్ చేసి.. పాటపై ఒక్కసారిగా అంచనాలు పెంచారు.

ముందుగా చెప్పినట్లు.. శనివారం సాయంత్రం రా మచ్చా మచ్చా సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. హెలికాప్టర్ నుంచి రామ్ చరణ్ దిగుతున్నట్లుగా ఉండే షాట్ తో పాట ప్రోమో స్టార్ట్ అయింది. ఆ తర్వాత రా మచ్చా మచ్చా అంటూ మాస్ బీట్ తో సాంగ్ సాగుతూ.. ఫుల్ జోష్ నింపుతోంది. అనంత్ శ్రీరామ్ అందించిన లిరిక్స్ కు తమన్ అదిరిపోయే ట్యూన్ కట్టారు. నకాష్ అజీజ్.. మూడు లాంగ్వేజెస్ లో పాడారు. డ్యాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు.

అయితే పాటలో రామ్ చరణ్ డ్యాన్స్ అదిరిపోయింది. మాస్ బీట్ కు క్లాస్ డ్రెస్ లో గ్రేస్ ఫుల్ స్టెప్పులతో మెప్పించారు. శంకర్, తమన్ రీసెంట్ గా చెప్పినట్లు.. సాంగ్ లో వేలాది మంది జానపద నృత్యకారులు కనిపించారు. పలు రాష్ట్రాలకు చెందిన జానపద సంస్కృతులను ప్రతిబింబిస్తూ మెప్పించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, కర్ణాటక, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు చెందిన అనేక మంది జానపద కళాకారులు తమ సాంప్రదాయ నృత్యాలతో అలరించారు.

ఇక, సినిమాలో రామ్ చరణ్ కు ఇది ఇంట్రడక్షన్ సాంగ్ అని శంకర్ హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాట థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని చెబుతున్నారు అభిమానులు. వేరే లెవెల్ లో సాంగ్ ఉంటుందని చెబుతున్నారు. అయితే నేడు ప్రోమో రిలీజ్ కాగా.. ఫుల్ సాంగ్ సెప్టెంబర్ 30వ తేదీన తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. మరి రా మచ్చా మచ్చా ఫుల్ సాంగ్ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో వేచి చూడాలి.

Full View
Tags:    

Similar News