ఇంటికొచ్చేసిన రామ్ చరణ్ కుట్టి ఫ్రెండ్
రీసెంట్ గా ఆ కుట్టి జూబ్లిహిల్స్ ఏరియాలోని రోడ్ నెం. 25లో మిస్ అయినట్టుగా ఉపాసన ఇన్‌స్టాలో వెల్లడిస్తూ ఎక్కడైనా కనిపిస్తే చెప్పండని షేర్ చేసింది.
రామ్ చరణ్, ఉపాసన ఇంట్లో వారితో పాటూ రకరకాల పక్షులు, జంతువులు కూడా ఉంటాయన్న విషయం తెలిసిందే. వారిద్దరికీ పెట్స్ అంటే ఎంతో ఇష్టం. వారికి రైమ్ అనే కుక్క పిల్లతో పాటూ బాద్‌షా, కాజల్, బ్లేజ్ అనే గుర్రాలు కూడా ఉన్నాయి. వాటన్నింటితో పాటూ కుట్టి అనే ఆఫ్రికన్ జాతికి చెందిన చిలుక కూడా చరణ్ కు ఉంది.
రీసెంట్ గా ఆ కుట్టి జూబ్లిహిల్స్ ఏరియాలోని రోడ్ నెం. 25లో మిస్ అయినట్టుగా ఉపాసన ఇన్‌స్టాలో వెల్లడిస్తూ ఎక్కడైనా కనిపిస్తే చెప్పండని షేర్ చేసింది. ఆ పోస్ట్ చూసిన యానిమల్ వారియర్ ఆర్గనైజేషన్ వాళ్లు ఆ చిలుకను వెతికి పట్టుకుని తిరిగి చరణ్, ఉపాసన దంపతులకు అందించినట్టు ఇన్‌స్టా ద్వారా తెలిపారు.
ఆ చిలుక ఇంటికి వెళ్లి రామ్ చరణ్ ను చూడగానే ఆయన భుజంపై వెళ్లి కూర్చుందట. కుట్టికి, రామ్ చరణ్ కు మధ్య ఎంత బాండింగ్ ఉంటే అది సరాసరి వెళ్లి ఆయన భుజంపై కూర్చుందట. కుట్టిని మళ్లీ ఇంటికి వచ్చేలా సహాయపడిన వహ్రా, ప్రియ మరియు యానిమల్ వారియర్ టీమ్ సభ్యులందరికీ ఉపాసన ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పింది.
యానిమల్ వారియర్స్ తమ సోషల్ మీడియాలో ఆ కుట్టిని ఎలా రెస్య్కూ చేశారనేది వివరంగా చెప్తూ, కుట్టి తిరిగి వెళ్లడంపై చరణ్, ఉపాసన ఎంతో సంతోషించారని, వారిద్దరికీ యానిమల్ వెల్ఫేర్ పైనున్న ఇష్టాన్ని ప్రశంసించారు. తప్పిపోయిందనుకున్న తమ కుట్టి చిలుక దొరకడంతో చరణ్ ఎంతో సంతోషించాడని కూడా యానిమల్ వారియర్స్ తెలిపారు.
ఇక చరణ్ ఫిల్మోగ్రఫీ విషయానికొస్తే రీసెంట్ గా గేమ్ ఛేంజర్ తో డిజాస్టర్ ను అందుకున్న ఆయన, ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా చరణ్ కెరీర్లో 16వ మూవీగా తెరకెక్కుతుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా రీసెంట్ గా ఓ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.