రామ్ ఈసారి గురి తప్పకుండా..?
ఎనర్జిటిక్ స్టార్ రామ్ సినిమాలు ఈమధ్య బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఇస్మార్ట్ శంకర్ తో తిరిగి ఫాంలోకి వచ్చినట్టే అనుకున్న రామ్ మళ్లీ అదే ఫెయిల్యూర్ పంథా కొనసాగిస్తున్నాడు.
ఎనర్జిటిక్ స్టార్ రామ్ సినిమాలు ఈమధ్య బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఇస్మార్ట్ శంకర్ తో తిరిగి ఫాంలోకి వచ్చినట్టే అనుకున్న రామ్ మళ్లీ అదే ఫెయిల్యూర్ పంథా కొనసాగిస్తున్నాడు. ఐతే సక్సెస్ ఫుల్ సినిమా కోసం రామ్ తన ప్రయత్నాలను మాత్రం ఆపట్లేదు. ప్రస్తుతం రామ్ తన 22వ సినిమాను మహేష్ డైరెక్షన్ లో చేస్తున్నాడు. ఈ సినిమాలో భాగ్య శ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. మిస్టర్ బచ్చన్ తో యూత్ ఆడియన్స్ లో పాపులర్ అయిన భాగ్య శ్రీ రామ్ తో జత కడుతుంది.
ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని రామ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉన్నాడు. అందుకే గురి తప్పకుండా ఉండేలా సినిమా మీద స్పెషల్ ఫోకస్ చేస్తున్నాడట. ఈ సినిమా లో రామ్, భాగ్య శ్రీ కెమిస్ట్రీ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని అంటున్నారు. క్లాస్ మాస్ అనే తేడీ లేకుండా రామ్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నాడు. ఐతే ఈ సినిమా మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపించేలా ఉంటుందని అంటున్నారు.
వరుస ఫ్లాపులతో కెరీర్ రిస్క్ లో పడుతున్న విషయాన్ని గుర్తించిన రామ్ కథల విషయంలో చాలా జాగ్రత్త పడాలని ఫిక్స్ అయ్యాడు. ఐతే రామ్ మహేష్ కాంబోలో రాబోతున్న ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఇంకా స్క్రీన్ ప్లే మ్యాజిక్ చేస్తాయని అంటున్నారు. యూత్ ఆడియన్స్ లో రామ్ కి మంచి ఫాలోయింగ్ ఉంది. ఐతే సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకోవాలన్న రామ్ ప్రయత్నాలన్నీ ఆశించిన విధంగా వర్క్ అవుట్ అవ్వట్లేదు.
ముఖ్యంగా ఇస్మార్ట్ శంకర్ తర్వాత తీసిన రెడ్, ది వారియర్, స్కంద, డబుల్ ఇస్మార్ట్ ఇవేవి రామ్ కి సరైన సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అందుకే ఈసారి తన మార్క్ రొమాంటిక్ ఎంటర్టైనర్ తో వచ్చి హిట్ కొట్టాలని చూస్తున్నాడు రామ్. సెట్స్ మీద ఉన్నప్పుడే ఈ సినిమాకు పాజిటివ్ బజ్ ఏర్పడిందని తెలుస్తుంది. మరి రామ్ కోరుకుంటున్న సూపర్ హిట్ సినిమా ఇది అవుతుందా లేదా అన్నది చూడాలి. రామ్ 22గా రాబోతున్న ఈ సినిమా గురి తప్పకూడదని ప్రయత్నిస్తున్నాడు. ఐతే మేకర్స్ మాత్రం ఈ సినిమా మీద సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తుంది.