ఆ వ్యాఖ్య‌ల‌పై శాస్త్రిగారు ఉద్దేశం ఇది!

నిన్న‌టి రోజున దిల్ రాజు రికార్డుల విష‌యంలో టాప్ -2 లో ఉండేలా ఉంద‌ని అంచ‌నా వేసిన సంగ‌తి తెలిసిందే.

Update: 2024-09-28 05:23 GMT

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ న‌టించిన `దేవ‌ర` భారీ వ‌సూళ్ల‌తో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. 'దేవ‌ర' దూకుడు చూస్తుంటే బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్నే న‌మోదు చేసేలా ఉంది. డే వ‌న్ రికార్డు వ‌సూళ్లు చూసి అంద‌రిలోనూ అంచ‌నాలు అంకంత‌కు రెట్టింపు అవుతున్నాయి. నిన్న‌టి రోజున దిల్ రాజు రికార్డుల విష‌యంలో టాప్ -2 లో ఉండేలా ఉంద‌ని అంచ‌నా వేసిన సంగ‌తి తెలిసిందే.

మూడేళ్ల కొర‌టాల శివ క‌ష్టాని త‌గ్గ ఫ‌లితం ఇది అన్నారు. ఇదే వేదిక‌లో క‌ళ్యాణ్ రామ్ సంతోషం వ్య‌క్తం చేసారు. అయితే ర‌చ‌యిత రామ‌జోగ‌య్య శాస్త్రీ కూడా ఎవ‌రి ప‌ని వారిని చేయినిస్తే స‌క్సెస్ ఇలా ఉంటుం ద‌ని వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్య‌లు ఇప్పుడి నెట్టింట కాక పుట్టిస్తున్నాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల్ని వైర‌ల్ చేస్తూ మెగా అభిమానుల‌పై సెటైర్లు వేస్తున్నారు. దీంతో విష‌యాన్ని శాస్త్రిగారు వెంట‌నే ప‌సిగ‌ట్టి త‌న వ్యాఖ్య‌ల్ని త‌ప్పుగా తీసుకుంటున్నార‌ని మ‌రో ట్వీట్ వేసాడు.

`ఓరి నాయ‌నో..ఇది ఎటు దారితీస్తుందో? శివ గారు త‌న టెక్నీషియ‌న్ల‌కు పూర్తి స్వేచ్ఛ‌నిచ్చి ప‌ని చేయించారు. అంతే త‌ప్ప ఇందులో మ‌రో అర్దం లేదు. విప‌రీత అర్దాలు తీయోద్ద‌ని మ‌న‌వి చేసు కుంటున్నా` అని క్లారిటీ ఇచ్చారు. దేవ‌ర ప్ర‌చారంలో భాగంగా కొర‌టాల శివ ఎవ‌డి ప‌ని వాడిని చేయినిస్తే ప్ర‌పంచం ప్ర‌శాంతంగా ఉంటుంద‌న్నాడు.

మ‌ధ్య‌లో వేలు పెట్ట‌డం వ‌ల్ల అది పూర్తికాక‌, స‌రిగ్గా రాక‌.. వాళ్లు చేయ‌క‌...మిగ‌తా వారు చేయ‌కఎటూ గాకుండా పోతుంద‌'న్నాడు. ఈ వ్యాఖ్య‌ల్ని కోర‌టాల ప్లోలో స‌హ‌జంగా మాట్లాడిన వ్యాఖ్య‌లు మాత్ర‌మే. ఎవ‌ర్నీ ఉద్దేశిం చిన‌వి కాదు. కానీ సోష‌ల్ మీడియాలో మాత్రం వాటికి ర‌క‌ర‌కాల అర్దాలు వెతికే కార్య‌క్ర‌మం న‌డిచింది. ఈ క్ర‌మంలోనే ఓ స్టార్ హీరోకి కౌంట‌ర్ గానే ఆ వ్యాఖ్య‌లు చేసారంటూ ర‌చ్చ మొద‌లైంది.

Tags:    

Similar News