రామాయణం: నితీష్ అంతా సైలెంటుగానే..!
అలాగే రామోజీ ఫిలిం సిటీలో ఒక గ్రాండ్ సెట్ వేస్తున్నారని కూడా గుసగుస వినిపిస్తోంది. సాంప్రదాయ గురుకుల వాతావరణం కోసం ఆధునిక గ్రీన్ మ్యాట్ స్క్రీన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
నితేష్ తివారీ రామాయణం ప్రారంభం అవుతుందా? అవ్వదా? ఇటీవలి కాలంలో నెటిజనుల్లో వాడి వేడి చర్చ ఇది. ఒక అడుగు ముందుకు పది అడుగులు వెనక్కి పడుతుంటే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఈ సినిమాలో నటీనటుల వివరాల్ని ఇప్పటివరకూ నితీష్ వెల్లడించకపోవడం, కొందరు స్టార్లు తప్పుకోవడం, లాంచింగ్ డేట్ చెప్పకపోవడంతో అనుమానాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ సినిమా నుంచి కీలకమైన నిర్మాతలు మధుమంతెన- అల్లు అరవింద్ తప్పుకోవడం కూడా కొన్ని సందేహాలకు తావిచ్చింది.
అయితే నితీష్ తివారీ రామాయణంకి ఇంకా బ్రేక్ పడలేదు. ప్రస్తుతం పనులు జరుగుతున్నాయని మాత్రం తెలిసింది. ఏప్రిల్ లో అసలైన చిత్రీకరణ మొదలవుతుంది. ప్రముఖ జాతీయ మీడియా కథనం ప్రకారం,... రణబీర్ కపూర్ లార్డ్ శ్రీరామ్ ఐకానిక్ పాత్రను చిత్రీకరిస్తూ, ప్రస్తుతం లాస్ ఏంజిల్స్‌లో కీలకమైన 3D స్కాన్‌లను ఖరారు చేయడంలో నిమగ్నమై ఉండగా, మిగిలిన బృందం ముంబైలోని ఫిల్మ్ సిటీలో ప్రారంభ సన్నివేశాల్లోకి ప్రవేశించడానికి సిద్ధమైంది.
తాజా కథనాల ప్రకారం.. చిత్రీకరణ ప్రారంభ దశలో లార్డ్ రామ్, లక్ష్మణ్, భరత్ లతో కూడుకున్న సన్నివేశాలను తెరకెక్కిస్తారు. ఇప్పటికే బాల కళాకారులతో సీన్స్ ని తీసేందుకు ప్రాక్టీస్ మొదలైంది. శిశిర్ శర్మ గౌరవనీయ గురువైన వశిష్ఠ పాత్రలో నటిస్తున్నారు. వశిష్ఠ యువ రాకుమారుడైన శ్రీరామునికి లోతైన జీవిత పాఠాలను తెలియజేస్తాడు.
అలాగే రామోజీ ఫిలిం సిటీలో ఒక గ్రాండ్ సెట్ వేస్తున్నారని కూడా గుసగుస వినిపిస్తోంది. సాంప్రదాయ గురుకుల వాతావరణం కోసం ఆధునిక గ్రీన్ మ్యాట్ స్క్రీన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కథన ప్రామాణికతతో దృశ్య వైభవాన్ని సజావుగా మిళితం చేయడం కోసం ప్రయత్నిస్తున్నారు. ప్రారంభ చిత్రీకరణలో రణబీర్ కపూర్ పై కొన్ని సన్నివేశాలే ఉంటాయి.
ఇతరులపై మెజారిటీ సీన్స్ తెరకెక్కిస్తారు. ఏప్రిల్ మధ్య నాటికి రణబీర్ తిరిగి సెట్స్ లో చిత్ర బృందంతో చేరాల్సి ఉంది. 17 ఏప్రిల్ 2024న శ్రీరామ నవమి సందర్భంగా 'రామాయణం' నుంచి గొప్ప అప్ డేట్ ని అందించేందుకు నితీష్ ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నారని సమాచారం. దర్శకుడు నితీష్ తీరు చూస్తుంటే, అతడు అంతా సైలెంట్ గానే కానిచ్చేస్తున్నాడని అర్థం చేసుకోవచ్చు. మీడియా పుకార్లను కూడా అతడు పెద్దగా పట్టించుకోవడం లేదు.