జపాన్‌లో చరణ్‌కు ఇంత క్రేజా?

అలాంటిది తాజాగా ఈ గ్లోబల్ స్టార్ కోసం జపాన్ దేశం నుంచి కొందరు ఫ్యాన్స్ హైదరాబాద్‌కు వచ్చారు.

Update: 2024-10-24 08:04 GMT

యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా ఎన్నో విధాలుగా ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోగా దూసుకెళ్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఈ మధ్య కాలంలో వరుసగా హిట్లు మీద హిట్లు కొడుతూ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నాడు. దీనికితోడు RRR తర్వాత చరణ్ గ్లోబల్ స్టార్ అనిపించుకుంటున్నాడు. దీంతో మరింత జోష్‌తో వెళ్తున్నాడు.

మాంచి దూకుడు మీదున్న రామ్ చరణ్ ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో ‘గేమ్ చేంజర్’ సినిమాను చేస్తున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్‌ ఇప్పటికే కంప్లీట్ అయింది. ఈ చిత్రం వచ్చే జనవరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇది విడుదల కాకముందే రామ్ చరణ్ తన 16వ సినిమాను స్టార్ట్ చేయబోతున్నాడు. బుచ్చిబాబు సన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే.

టాలీవుడ్ హీరోల రేంజ్ ఈ మధ్య కాలంలో భారీ స్థాయిలో పెరిగిపోయింది. ముఖ్యంగా RRR చిత్రం తర్వాత రామ్ చరణ్ ఇంటర్నేషనల్ రేంజ్‌కు చేరుకున్నాడు. ఇది జపాన్‌లో సైతం విడుదల అవడంతో అక్కడ కూడా మెగా పవర్ స్టార్‌కు మంచి మార్కెట్‌తో పాటు ఫ్యాన్ బేస్ వచ్చింది. అందుకే చరణ్ ఎప్పుడు ఆ దేశంలో పర్యటించినా అక్కడ అతడికి నీరాజనాలు పడుతున్నారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు ఇండియా వ్యాప్తంగా క్రేజ్ ఉంది. అతడిని కలిసేందుకు ఎంతో మంది అభిమానులు ఉత్సాహం చూపిస్తుంటారు. అలాంటిది తాజాగా ఈ గ్లోబల్ స్టార్ కోసం జపాన్ దేశం నుంచి కొందరు ఫ్యాన్స్ హైదరాబాద్‌కు వచ్చారు. వాళ్లందరినీ రామ్ చరణ్ తన నివాసంలో కలుసుకున్నాడు. ఈ సందర్భంగా జపాన్ నుంచి వచ్చిన వాళ్లతో అతడు ఆప్యాయంగా మాట్లాడి ప్రేమను చూపించాడు.

జపాన్ అభిమానులతో రామ్ చరణ్ చాలా సమయం పాటు సరదాగా గడిపాడు. ఆ సమయంలోనే తన ఫ్యామిలీని వాళ్లకు పరిచయం చేయడంతో పాటు సినీ సంబంధిత విశేషాలను సైతం పంచుకున్నట్లు తెలిసింది. రామ్ చరణ్ జపాన్ ఫ్యాన్స్‌ను కలిసిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. దీంతో వీటిని మెగా అభిమానులు ఓ రేంజ్‌లో షేర్లు చేశారు. ఫలితంగా ఈ వీడియోలు వైరల్‌గా మారిపోయాయి.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కోసం జపాన్ నుంచి అభిమానులు రావడం చూసిన వాళ్లంతా అవాక్కవుతున్నారు. అతడికి ఆ దేశంలో ఇంత క్రేజ్ ఉందా అని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి ఈ మీటింగ్ వల్ల రామ్ చరణ్ రేంజ్ ఏ మేర పెరిగిపోయిందో మరోసారి నిరూపణ అయింది.

Tags:    

Similar News