చరణ్ మూవీ.. గ్రామ నిర్మాణం షురూ

సినిమాలో ఎక్కువ శాతం సన్నివేశాలు పల్లెటూరు నేపథ్యంలో ఉంటాయట. అందుకోసం భారీ పల్లెటూరు సెట్‌ నిర్మాణం జరుగుతోంది.

Update: 2024-05-30 10:18 GMT

రామ్‌ చరణ్‌ నటిస్తున్న గేమ్‌ ఛేంజర్‌ సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది. అక్టోబర్‌ లో ఆ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా స్వయంగా దిల్‌ రాజు కుమార్తె ప్రకటించారు. కనుక జులై లేదా ఆగస్టు వరకు షూటింగ్‌ ను ముగించే అవకాశాలు ఉన్నాయి.

గేమ్‌ ఛేంజర్‌ సినిమా పూర్తి అవ్వడమే ఆలస్యం వెంటనే దర్శకుడు బుచ్చి బాబు సినిమా మొదలు అవ్వబోతుంది. బుచ్చిబాబు దర్శకత్వంలో నటించేందుకు గాను ఇప్పటికే రామ్‌ చరణ్ గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది.

ఇటీవలే లాంచనంగా ప్రారంభం అయిన చరణ్‌ - బుచ్చిబాబు మూవీకి సంబంధించిన ఆసక్తికర విషయం ఒకటి ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. సినిమాలో ఎక్కువ శాతం సన్నివేశాలు పల్లెటూరు నేపథ్యంలో ఉంటాయట. అందుకోసం భారీ పల్లెటూరు సెట్‌ నిర్మాణం జరుగుతోంది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం సిటీ కి మధ్యలో, అది కూడా చరణ్‌ నివాసం ఉంటున్న ఇంటికి కొద్ది దూరంలో విశాలమైన ప్రదేశంలో గ్రామం ను దర్శకుడు బుచ్చిబాబు ప్రముఖ ఆర్ట్‌ డైరెక్టర్ తో కలిసి నిర్మిస్తున్నాడట.

సినిమాలో మెజార్టీ సన్నివేశాలు మరియు పాటలు అక్కడే షూట్‌ చేస్తారు. కనుక ఎక్కువ ఖర్చు చేసి చాలా డిటైలింగ్‌ తో సెట్‌ ను క్రియేట్‌ చేస్తున్నారని సమాచారం అందుతోంది. మైత్రి మూవీ మేకర్స్‌ వారు ఈ సినిమాను సుకుమార్‌ తో కలిసి నిర్మిస్తున్నారు.

జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది దసరా లేదా దీపావళి సీజన్‌ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. స్పోర్ట్స్‌ డ్రామా నేపథ్యంతో రూపొందబోతున్న ఈ సినిమా పై అంచనాలు ఇప్పటి నుంచే భారీగా ఉన్నాయి.

Tags:    

Similar News