చరణ్ అంత మాట అనేసాడేంటి?
వ్యాపారాలు సక్సెస్ చేయడంలో తానో వీక్ పర్సన్ అన్నారు. అవును ఈ మాటలు ఆయనే స్వయంగా అన్నారు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. పాన్ ఇండియా స్టార్....పాన్ వరల్డ్ లో సైతం సంచలనాలు సృష్టించడానికి రెడీ అవుతున్నారు. అలాగే చరణ్ మంచి బిజినెస్ మ్యాన్ కూడా. ఎన్నో వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టి దిగ్విజయంగా నిర్వహిస్తున్నారు. కొత్త కొత్త వ్యాపార రంగంలోకి చరణ్ ఎంటర్ అవుతున్నారు. ఇది మనందరికి తెలిసింది. కానీ చరణ్ ఓ బ్యాడ్ బిజినెస్ మ్యాన్ అని తనని తానే వర్ణించుకున్నారు.
వ్యాపారాలు సక్సెస్ చేయడంలో తానో వీక్ పర్సన్ అన్నారు. అవును ఈ మాటలు ఆయనే స్వయంగా అన్నారు. తనకి సినిమా తప్ప ఇంకే తెలియదని..అనవసరంగా వ్యాపార రంగంలో తల దూర్చానని అన్నారు. సినిమాలు...సినిమా నిర్మాణానికి సంబంధించిన వ్యాపారం చేయడం ఇష్టం. అవి కాకుండా ఇంకే వ్యాపారాలు చేయలేను. అంకెల వ్యవహారం మనకి సరిపడటం లేదు. పైగా అలా చేస్తే రెండు పడవల ప్రయాణం అవుతుంది. అందుకే ఇక వ్యాపారాలు చేయకూడదనుకుంటున్నా.
నాకు తెలిసిన సినిమా నటన రంగం...ఆ తర్వాత నిర్మాణం ఈ రెండు వ్యవహారాలే చూస్తా. గతంలో చేసిన వ్యాపారాలేవి కలిసి రాలేదన్నాడు. సినిమాలకు సంబంధించి తన సొంత నిర్ణయాలతో ముందకెళ్తానని... అందరూ చెప్పేది వింటానని..కానీ చివరిగా నిర్ణయం తీసుకునే టప్పుడు అన్ని ఆలోచించి తానే స్వయంగా తీసుకున్న నిర్ణయాన్ని అమలు పరుస్తానని అన్నారు. మొత్తానికి రామ్ చరణ్ వ్యాపారాల్లో నష్టాలు రావడంతో రియలైజ్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తోంది.
ట్రూజెట్ విమానయాన సంస్థని చరణ్ కొన్నాళ్లు రన్ చేసిన సంగతి తెలిసిందే. అందులో భారీగా నష్టాలు రావడంతో ఆపేసారు. ఇంకా బయటకు తెలియని వ్యాపారాలు చరణ్ చాలానే చేసి ఉండొచ్చు. వాటి నష్టాలు చరణ్ ని ఇలా వెనక్కి లాగి పెడుతూ ఉండొచ్చు. అయినా వ్యాపారం అన్నాక లాభ నష్టాలు ఉంటాయి. కొంత అనుభవం వచ్చిన తర్వాతే అన్ని విషయాలు అర్దమవుతాయి. మరి చరణ్ తీసుకున్న సంచలన నిర్ణయంపై మరోసారి పునరాలోచన చేస్తారేమో చూడాలి.