చరణ్ పప్పు..అప్పడం బ్యాచ్!
ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫుడ్ మాత్రం వీళ్లకు పూర్తి భిన్నంగా ఉంటుంది.
ఇండస్ట్రీలో నాన్ వెజ్ ప్రియులు ఎవరంటే? అందరికీ గుర్తొచ్చే రెండు పేర్లు ప్రభాస్..ఎన్టీఆర్. ఇద్దరూ నాన్ వెజ్ వంటకాలు అంటే ఎంతో ఇష్టం. మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకూ తప్పనిసరిగా నాన్ వెజ్ స్పెషల్స్ ఉండాల్సిందే. అయితే బరువు తగ్గాలి అనుకున్న సమయంలో వాటికి పూర్తిగా దూరంగా ఉంటారు. ప్రభాస్ ఏకంగా ఓచెఫ్ టీమ్నే మెయింటెన్ చేస్తుంటారు. ఆయన ఏ దేశం వెళ్లినా వెంట వాళ్లుంటారు. తనకి కావాల్సిన నాన్ వెజ్ వంటకాల్ని స్వయంగా తయారు చేయిస్తాడు.
తనతో పాటు అవసరమైన వాళ్లందరికీ వడ్డిస్తాడు కూడా. ఇక ఎన్టీఆర్ కూడా అన్ని రకాల నాన్ వెజ్ వంటకాలు ఎంతో ఇష్టపడతాడు. సండే వచ్చిందంటే హైదరాబద్ రెస్టారెంట్ బిరియానీ తప్పనిసరిగా రుచి చూడాల్సిందే అంటారు. ఆ రకంగా ఇద్దరు టాలీవుడ్ లో డార్లింగ్..తారక్ ని మంచి నాన్ వెజ్ ప్రియులుగా చెప్పొచ్చు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫుడ్ మాత్రం వీళ్లకు పూర్తి భిన్నంగా ఉంటుంది.
చరణ్ ప్రతిరోజూ ఉదయాన్నే రెండు పూర్తి ఎగ్స్‌తో పాటు మూడు ఎగ్ వైట్స్ తీసుకుంటారుట. ప్రొటీన్లు, ఆరోగ్యకర కొవ్వులు అధికంగా ఉండే ఎగ్స్‌తో శక్తి లభించడమే కాకుండా కడుపునిండిన భావనతో ఇవి బరువు తగ్గించడంలోనూ సహకరిస్తాయి. అందుకే వాటిని ఎక్కువగా తీసుకుంటారు.
ఇక బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు చరణ్ రోజూ బాదం పాలు తాగుతారుట. ఓ బౌల్ ఓట్స్ తీసుకుంటారుట. ఈ రెండింటిలో ఆరోగ్యకర కొవ్వులు, ప్రొటీన్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు, ఫాస్పరస్, విటమిన్ ఈ లభిస్తాయి.
ఇక మధ్నాహ్నం లంచ్ లో కర్రీ లేదా ఆకుకూరలు కూరగాయలతో కలిపి చికెన్ వింగ్స్‌తో లంచ్ గా తీసుకుంటారుట. తక్కువ క్యాలరీలతో కూడిన బ్రౌన్‌రైస్ తీసుకుంటారుట. అయితే వీటన్నింటికంటే పప్పు..రసం..సాంబారు అంటే బాగా ఇష్టమట.
లంచ్ లో డైలీ ఆ మూడు ఉన్నా చాలుట. మరో ఆలోచన లేకుండా ఇష్టపడి తింటారుట. ఇక నైట్ డిన్నర్‌కు ముందు ఫ్రైడ్ ఫిష్ తీసుకుంటారుట. కూరగాయలతో చేసిన సలాడ్ డిన్నర్‌లో తప్పక ఉంటుందిట. రోజంతా మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు, స్నాక్స్‌గా డ్రైఫ్రూట్స్ తీసుకుంటారు. ఆరకంగా చరణ్ ఎక్కువగా వెజ్ వంటకాలే తీసుకుంటారని తెలుస్తోంది.