గేమ్ ఛేంజర్.. ఒక్క పాటకు అన్ని కోట్లా?

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మూవీ గేమ్ చేంజర్.

Update: 2023-10-26 03:56 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మూవీ గేమ్ చేంజర్. దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్ లో నిర్మిస్తున్నారు. కియరా అద్వానీ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. అతని పాత్ర తండ్రికొడుకులుగా ఉండబోతోంది.

ఇప్పటికే మెజారిటీ షూటింగ్ కంప్లేట్ అయ్యింది. శంకర్ సినిమా అంటే కథతో పాటు పాటలు కూడా చాలా గ్రాండ్ గా ఉంటాయనే సంగతి అందరికి తెలిసిందే. మినిమం బడ్జెట్ రేంజ్ సినిమాకి అయ్యే ఖర్చుని శంకర్ తన సినిమాలోని ఒక సాంగ్ కోసం ఖర్చు పెడుతూ ఉంటారు. దానికి తగ్గట్లుగానే శంకర్ మూవీలో సాంగ్స్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.

అలాగే గేమ్ చేంజర్ లో జరగండి.. జరగండి అంటూ వచ్చే డ్యూయెట్ సాంగ్ కోసం ఏకంగా 16 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా సెట్ వేయించారంట. ఈ సెట్ లో సాంగ్ మొత్తం చిత్రీకరించినట్లు తెలుస్తోంది. స్క్రీన్ మీద చూసినపుడు అచ్చమైన నేచురల్ లోకేషన్స్ లో సాంగ్ షూట్ చేసిన అనుభూతి కలుగుతుందని ఇండస్ట్రీ వర్గాలలో చెప్పుకుంటున్నారు.

గేమ్ చేంజర్ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ గా ఈ పాటని రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ సాంగ్ సోషల్ మీడియాలో లీక్ అయ్యి వైరల్ అయిపొయింది. దీంతో కరెక్ట్ టైం చూసుకొని ఒరిజినల్ సాంగ్ ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయ్యిందంట. ఇప్పటికే ఈ సాంగ్ షూటింగ్ కూడా కంప్లీట్ కావడం, అద్భుతంగా రావడం జరిగిందని తెలుస్తోంది.

మెగా ఫ్యాన్స్, గ్లోబల్ స్టార్ అభిమానులు కూడా ఈ సాంగ్ ని విజువల్ గా చూడటం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గేమ్ చేంజర్ మూవీ నుంచి అప్డేట్స్ కావాలని ఆశిస్తున్నారు. శంకర్ ఫ్యాన్స్ కోరికని మన్నించి ఈ సాంగ్ ని ఏమైనా రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తారా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News