చరణ్ ముందస్తు జాగ్రత్తలు
షెడ్యూల్స్ కూడా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వీలైనంత వేగంగా మూవీ కంప్లీట్ అయ్యేలా చూడాలని సూచించారంట
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ సినిమాని స్టార్ట్ చేశారు. అయితే ఇప్పటికి సినిమా షూటింగ్ కంప్లీట్ కాలేదు. శంకర్ ఓ వైపు గేమ్ చేంజర్ తో పాటుగా ఇండియన్ 2 కూడా షూటింగ్ చేస్తున్నారు. ఈ కారణంగా ఎక్కువ జాప్యం జరుగుతోంది. శంకర్ సినిమా అంటేనే ఏళ్ల తరబడి షూటింగ్ జరుగుతూ ఉంటుంది.
అలాంటిది ఒకేసారి రెండు సినిమాలు ప్రస్తుతం చేస్తున్నారు. దీంతో మరింత ఆలస్యం అవుతూ వస్తోంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆచార్య మూవీతో వచ్చిన అది కాస్తా డిజాస్టర్ అయ్యింది. పాన్ ఇండియా స్థాయిలో సోలో గా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి గేమ్ చేంజర్ ఉపయోగపడుతుందని అనుకుంటే అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు. ఇక RC 16 మీద చరణ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
రీసెంట్ గా ఈ మూవీ ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయ్యింది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ జోనర్ లో ఉండబోతోందంట. ఈ సినిమాపై బుచ్చిబాబు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయితే చరణ్ ఈ మూవీ విషయంలో బుచ్చిబాబుకి కొన్ని రూల్స్ పెట్టినట్లు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితిలో షూటింగ్ ఆలస్యం కాకూడదని, పక్కా ప్లానింగ్ తో రెడీ కావాలని చెప్పారంట.
షెడ్యూల్స్ కూడా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా వీలైనంత వేగంగా మూవీ కంప్లీట్ అయ్యేలా చూడాలని సూచించారంట. ఆర్ఆర్ఆర్, గేమ్ చేంజర్ కారణంగా రామ్ చరణ్ ఏకంగా లాంగ్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆర్ఆర్ఆర్ కోసం మూడేళ్లు, గేమ్ చేంజర్ కోసం రెండేళ్లు టైం కేటాయించారు. దీంతో రేస్ లో స్పీడ్ తగ్గిపోయింది. ఈ కారణంగానే బుచ్చిబాబు మూవీ మాత్రం ఎట్టిపరిస్థితిలో వచ్చే ఏడాదిలో రిలీజ్ చేసే విధంగా ప్లాన్ చేయమని సలహా ఇచ్చారంట.
ఈ కారణంగా బుచ్చిబాబు కూడా ఇప్పటికే ప్రీప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసి క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారంట. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ని ఈ సినిమాలో చరణ్ కి జోడీగా తీసుకునే ప్రయత్నంలో దర్శకుడు ఉన్నారని తెలుస్తోంది. అలాగే మిగిలింగ్ క్యాస్టింగ్ ఫైనల్ చేసి నవంబర్ లో షూటింగ్ స్టార్ట్ చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారంట.