RC 16: బుచ్చిబాబు గురువు కంటే స్పీడే..

ఉప్పెన సినిమాతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు

Update: 2024-03-28 04:38 GMT

ఉప్పెన సినిమాతో సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకొని గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకొని రామ్ చరణ్ హీరోగా RC16 సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళడానికి సిద్ధం అవుతున్నాడు. రీసెంట్ గా ఈ మూవీ ఓపెనింగ్ జరిగింది. ఏప్రిల్ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని టాక్. సినిమా షూటింగ్ కు ముందే పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ అయ్యాయి.

జాన్వీ కపూర్ ని ఈ మూవీలో హీరోయిన్ గా ఎంపిక చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ ని ఖరారు చేసుకున్నారు. సుదీర్ఘ గ్యాప్ తర్వాత రెహమాన్ తెలుగులో చేస్తోన్న సినిమా ఇదే కావడం విశేషం. బుచ్చిబాబు పట్టుబట్టి మరీ రెహమాన్ కి కథ చెప్పి మ్యూజిక్ చేయడానికి ఒప్పించారంట. ఈ సినిమా ఓపెనింగ్ కి కూడా రెహమాన్ అటెండ్ అయ్యారు.

క్యాస్టింగ్ సెలక్షన్ కూడా అయిపోయిందని తెలుస్తోంది. రామ్ చరణ్ కి విలన్ గా వేరే భాషకి చెందిన హీరోని ఖరారు చేసినట్లు టాక్. అలాగే ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో పీరియాడిక్ జోనర్ మూవీ కావడంతో ప్రత్యేకంగా సెట్స్ వేస్తున్నారంట. కొన్ని కీలక సన్నివేశాలు ఉత్తరాంధ్ర వెళ్లి షూట్ చేయనున్నారు. మూవీలో పెర్ఫెక్షన్ కోసం ఉత్తరాంధ్రకి చెందిన వారిని ఆడిషన్స్ చేసి ఆర్టిస్ట్స్ గా ఎంపిక చేసుకున్నాడు.

బుచ్చిబాబు గురువు సుకుమార్ తన సినిమాల విషయంలో ఎక్కువ పెర్ఫెక్షన్ చూపిస్తూ ఉంటారు. ప్రీప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు అన్నింటిలో కేర్ తీసుకోవడంతో పాటు వాటి కోసం టైం కూడా బాగా ఎక్కువ తీసుకుంటారు. అయితే సుకుమార్ శిష్యుడిగా వచ్చిన బుచ్చిబాబు మాత్రం టైం విషయంలో గురువుని కంటే బెటర్ అనేలా ఉన్నాడనే టాక్ వినిపిస్తోంది.

ఇంకా RC16 మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ కాకుండా రెహమాన్ లాంటి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ నుంచి మూడు సాంగ్స్ కంపోజ్ చేయించుకున్నాడంట. అంత పెద్ద సంగీత దర్శకుడి నుంచి ఇంత వేగంగా అవుట్ ఫుట్ తీసుకోవడం అంటే మామూలు విషయం కాదు. సాంగ్స్ కూడా అద్భుతంగా వచ్చాయని రామ్ చరణ్ బర్త్ డే ఈవెంట్ లో బుచ్చిబాబు క్లారిటీ ఇచ్చాడు.

అంటే అవుట్ ఫుట్ విషయం కాంప్రమైజ్ కాకుండా తనకి ఎలా కావాలో అలాగే తీసుకున్నట్లు బుచ్చిబాబు మాటల బట్టి తెలుస్తోంది. కంటెంట్ క్లిక్కయితే బుచ్చి కష్టానికి ఫలితం ఉంటుందని చెప్పవచ్చు. అయితే ఇటీవల కాలంలో రెహమాన్ ఇస్తున్న సాంగ్స్ గతంలో మాదిరిగా క్లిక్ కావడం లేదు. మరి బుచ్చిబాబు ఆయన నుంచి ఎలాంటి ట్యూన్స్ అందుకున్నాడో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

Tags:    

Similar News