చరణ్ తాతయ్య రోల్ కోసం ఆ లెజెండ్!
ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ ఇక్కడ నటుల్ని డిమాండ్ చేయడంతో ఒరిజినల్ ప్లేవర్ ఎక్కడా మిస్ కాకుండా బుచ్చిబాబు ఆ ఛాన్స్ తీసుకున్నాడు
రామ్ చరణ్ 16వ చిత్రం బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న సినిమా అతి త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే హీరోయిన్ గా జాన్వీకపూర్ ని ఫైనల్ చేసారు. ఇంకా స్టార్ హంట్ పేరుతో ఉత్తరాంధ్రలో ఔత్సాహిక కళాకారుల్ని ఈ సినిమాకి ఎంపిక చేసారు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ ఇక్కడ నటుల్ని డిమాండ్ చేయడంతో ఒరిజినల్ ప్లేవర్ ఎక్కడా మిస్ కాకుండా బుచ్చిబాబు ఆ ఛాన్స్ తీసుకున్నాడు.
ఇంకా సినిమాకి సంబంధించి అవసరమైన నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుంది. ఈనేపథ్యంలో కీలక పాత్రకి సంబంధించిన అప్ డేట్ ఒకటి వైరల్ అవుతోంది. ఇందులో చరణ్ తాతయ్య పాత్ర కోసం ఏకంగా బాలీవుడ్ లెజెండ్ బిగ్ బీ అమితాబచ్చన్ ని ఎంపిక చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమా ప్లాట్ కూడా తాత-మనవడు కాన్సెప్ట్ అని సమాచారం. ఈ నేపథ్యంలో ఆ పాత్రకి బమలైన స్టార్ అవసరం కావడంతో అమితాబ్ ని ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయం కన్పమ్ కావాల్సి ఉంది. ఇక మెగా ఫ్యామిలీతో అమితాబ్ బాండింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు.
బిగ్ బీ చిరంజీవి మంచి స్నేహితుడు. ఇద్దరి మధ్య స్నేహం చాలా కాలంగా కొనసాగుతుంది. చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి' సినిమాలో అమితాబాబ్ ఆయనకు గురువు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. అమితాబ్ కనిపించింది కాసేపే అయినా ఆమెరుపులు మామూలుగా లేదు. తాజాగా చిరంజీవి తనయుడితోనే తెరను పంచు కుంటే పరిపూర్ణం అయినట్లే. తండ్రి-తనయులతో నటించిన బిగ్ బీ అయిపోతారు.
ప్రస్తుతం అమితాబచ్చన్ పాన్ ఇండియా చిత్రం 'కల్కి 2898' లోకూడా కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా జ్ఞాన్ వేల్ తెరకెక్కిస్తోన్న 'వెట్టెయాన్' లో కూడా అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇలా అమితాబ్ సౌత్ లో దూకుడు పెంచారు. భవిష్యత్ లో మరిన్ని తెలుగు...తమిళ సినిమాలు చేసే అవకాశం ఉంది.