ఫోర్బ్స్ కవర్‌పై స్టైలిష్ చెర్రోపాసన
రామ్ చరణ్ - ఉపాసన దంపతులు అన్నివేళలా ఎందరికో స్ఫూర్తి. ఈ జంటకు 2023 అన్నివిధాలా కలిసొచ్చిన సంవత్సరం
రామ్ చరణ్ - ఉపాసన దంపతులు అన్నివేళలా ఎందరికో స్ఫూర్తి. ఈ జంటకు 2023 అన్నివిధాలా కలిసొచ్చిన సంవత్సరం. బేబి క్లిన్ కారా జననంతో మెగా ఫ్యామిలీలో అంతా మారిపోయింది. సెలబ్రిటీ కపుల్ చరణ్- ఉపాసన సెలబ్రేషన్స్ కి అవధుల్లేవ్. చరణ్ ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో గేమ్ ఛేంజర్ లో నటిస్తున్నాడు. వరుస చిత్రాలకు ప్రణాళికల్ని రచిస్తున్నాడు. మరోవైపు భార్య, కుమార్తెతో కలిసి షికార్లు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఇంతలోనే ఇప్పుడు ఫోర్బ్స్ మ్యాగజైన్ కవర్ పేజీపై ఈ అందమైన జంట ప్రత్యక్షమైంది. ముఖ్యంగా ఈ జోడీ లుక్ సెలెక్షన్ ఆఫ్ డ్రెస్ కోడ్ చర్చనీయాంశంగా మారింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పింక్ స్వెట్ షర్ట్ ధరించి, ఫార్మల్ ఫ్యాంటు తో ఎంతో స్టైలిష్ గా కనిపించాడు. అతడి చెంతనే ఉన్న ఉపాసన గులాబీ రెడ్ గౌనులో కనిపించింది. పవర్ఫుల్ కపుల్! అంటూ ఫోర్బ్స్ ఇండియా ఈ ఫీచర్ ని ప్రత్యేకంగా తీర్చిదిద్దింది.
వరల్డ్స్ టాప్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఇటీవలి ఎడిషన్ కవర్ షూట్ లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన ప్రత్యేకం అని సదరు మ్యాగజైన్ వెల్లడించింది. ప్రస్తుతం ఈ స్పెషల్ ఫోటో మెగాభిమానుల్లో వైరల్ గా మారింది. అందమైన కపుల్ ఎంతో ప్లెజెంట్ గా కనిపిస్తున్నారంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
మోవైపు రామ్ చరణ్ -ఉపాసన ప్రస్తుతం అనేక కమిట్మెంట్లను పూర్తి చేసేందుకు ముంబైలో ఉన్నారు. ఇప్పుడు ముంబైలోని మహారాష్ట్ర గౌరవనీయ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కార్యాలయాన్ని సందర్శించారు. కుమార్తె క్లిన్ కారా 6 నెలల సెలబ్రేషన్ ని జరుపుకున్న ఈ జంట ముందుగా మహాలక్ష్మి ఆలయంలో కనిపించారు. ఆ తరువాత ముంబైలో తమ బసను కొనసాగించారు. అనంతరం ఒక ముఖ్యమైన సందర్భం కోసం ముఖ్యమంత్రి కార్యాలయాన్ని అలంకరించారు. అతిథులను స్వాగతించడానికి షిండే కుమారుడు శ్రీకాంత్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంప్రదాయ తిలక్ వేడుక .. షిండే కోడలు వృశాలి ఆరతి కార్యక్రమం చరణ్ కుటుంబానికి సంప్రదాయ ఆతిథ్యాన్ని అందించింది.