వర్మ రిలీజ్ 'వ్యూహం' పై క్లారిటీ
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్ని రోజులుగా 'వ్యూహం' సినిమా తో వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్ని రోజులుగా 'వ్యూహం' సినిమా తో వార్తల్లో నిలుస్తున్న విషయం తెల్సిందే. ఆయన ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో రూపొందించిన విషయం తెల్సిందే. ఈ సినిమా ఏపీకి సంబంధించిన రాజకీయాలపై ఉంటుంది అనే విషయం ఇప్పటికే అందరికి క్లారిటీ వచ్చింది.
కొందరు ఈ సినిమా పై వ్యతిరేకంగా విడుదల కావద్దు అంటూ డిమాండ్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం వర్మ ఈ సినిమా ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి వర్మ తన వ్యూహం సినిమా విడుదల విషయంలో ఉన్న సందిగ్దం ను, సస్పెన్స్ ను తొలగిస్తూ విడుదల తేదీని ప్రకటించాడు.
ఇన్ని రోజులు వ్యూహం మాత్రమే అనుకుంటే వర్మ కొత్తగా శపథం ను కూడా తెరపైకి తీసుకు వచ్చాడు. వ్యూహం ను రెండు భాగాలుగా విడుదల చేయబోతున్న వర్మ మొదటి పార్ట్ ను వ్యూహం గా రెండో భాగం ను శపథం (వ్యూహం 2) గా విడుదల చేయబోతున్నట్లుగా అధికారికంగా తెలియజేస్తూ తేదీల విషయంలోనూ క్లారిటీ ఇచ్చాడు.
వ్యూహం సినిమా ను ఈనెల 29న విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించాడు. ఇక శపథం సినిమా ను జనవరి 25న విడుదల చేయబోతున్నాడు. కేవలం నెల రోజుల్లోనే రెండు సినిమాలను వర్మ విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాడు.
వ్యూహం తో పాటే శపథం కూడా రూపొందింది. కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంక్రాంతి తర్వాత ఆ సినిమాను విడుదల చేసే విధంగా వర్మ ప్లాన్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా వచ్చే ఏడాది వేసవి లో జరుగబోతున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపిస్తాయని రాజకీయ వర్గాల్లో కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి వర్మ వ్యూహం ఏపీ ఎన్నికల్లో ఎలా పని చేస్తుందో చూడాలి.