అందులోనే కిక్ ఉంటుందన్న ఎనర్జిటిక్ స్టార్..!

ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ ట్యాగ్ కి పర్ఫెక్ట్ అనిపించే ఎనర్జీతో తన పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తాడు.

Update: 2024-08-19 06:41 GMT

ఎనర్జిటిక్ స్టార్ ఉస్తాద్ రామ్ ట్యాగ్ కి పర్ఫెక్ట్ అనిపించే ఎనర్జీతో తన పెర్ఫార్మెన్స్ తో మెప్పిస్తాడు. రీసెంట్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమాతో మరోసారి సినిమా మీద తనకున్న డెడికేషన్ ఏంటన్నది చూపించాడు. సినిమా రిజల్ట్ పక్కన పెడితే రామ్ ఎనర్జీని అతని ఫ్యాన్స్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఐతే కెరీర్ లో సక్సెస్ వస్తేనే గ్రాఫ్ పెరుగుతుంది. ఐతే ఫ్లాపులు వచ్చినా కూదా రామ్ తన ఎనర్జీని ఏమాత్రం తగ్గించుకోకుండా సినిమాలు చేస్తున్నాడు. డబుల్ ఇస్మార్ట్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రామ్ తన పర్సనల్ విషయాల గురించి ప్రేక్షకులతో పంచుకున్నారు.

మామూలుగా అయితే అందరు ఫ్రెండ్స్ తో ఉండటానికి ఇష్టపడతారు. కానీ రామ్ కి చాలా తక్కువమంది ఫ్రెండ్స్ ఉన్నారట. అంతేకాదు వాళ్లతో సడెన్ గా 6 నెలలు మాట్లాడడట. ఏదో విషయం మీద అలా 6 నెలలు మాట్లాడకుండా ఉండి. మళ్లీ తర్వాత ఎక్కడ ఆగామో అక్కడ నుంచి కొనసాగిస్తామని అని చెప్పుకొచ్చాడు రామ్. అంతేకాదు తన ఫ్రెండ్స్ అంతా ఫారిన్ లో ఉన్నారని వాళ్లతో మాట్లాడాలనిపిస్తే ఫోన్ చేస్తే కలవాలనిపిస్తే చెప్పకుండానే వెళ్తానని అన్నారు రామ్.

ఎయిర్ పోర్ట్ కి వెళ్తూ కూడా టికెట్ బుక్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒకటి రెండు సార్లు లగేజ్ తీసుకోకుండా కూడా ఫ్లైట్ ఎక్కేశానని చెప్పారు రామ్. నచ్చింది చేయడం నచ్చినట్టు ఉండటం అనేది చాలా తక్కువ మందికి సాధ్యపడుతుంది. అలాంటి వారిలో రాం కూడా ఒకరని చెప్పొచ్చు. నచ్చింది చేయడంలోనే అసలు కిక్ ఉంటుందని రామ్ తన మాటల్లో చెప్పుకొచ్చారు.

ఇక రామ్ సినిమాల విషయానికి వస్తే ది వారియర్, స్కంద సినిమాల ఫ్లాప్ తర్వాత డబుల్ ఇస్మార్ట్ తో హిట్ కొడతాడని ఊహించగా సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో వర్క్ అవుట్ కాలేదు. ఐతే రామ్ ఎనర్జీ మాత్రం అతని ఫ్యాన్స్ ని ఖుషి చేసింది. రామ్ నెక్స్ట్ సినిమా హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉంటుందని టాక్. మిస్టర్ బచ్చన్ సినిమాను డైరెక్ట్ చేసిన హరీష్ శంకర్ నెక్స్ట్ రామ్ తో మరో పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ తో వస్తారని తెలుస్తుంది. ఈ కాంబోపై రామ్ ఫ్యాన్స్ కూడా సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

Tags:    

Similar News