రమ్య.. మచ్చలేని చందమామ

అయితే ఈ మధ్యకాలంలో మాత్రం చాలా మంది యంగ్ బ్యూటీస్ మేమెందులో కూడా తక్కువ కాదు అంటూ పోటీ పడుతున్నారు.

Update: 2024-08-26 09:55 GMT

తెలుగమ్మాయిలని కరెక్ట్ గా రిప్రజెంట్ చేయాలేగాని కచ్చితంగా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసే రేంజ్ లో చాలా మంది ఉన్నారు. ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల నుంచి నటిగా కెరియర్ ఎంచుకునే బ్యూటీస్ చాలా తక్కువ మంది ఉండేవారు. అయితే ఈ మధ్యకాలంలో మాత్రం చాలా మంది యంగ్ బ్యూటీస్ మేమెందులో కూడా తక్కువ కాదు అంటూ పోటీ పడుతున్నారు. అందం, అభినయంతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్లామర్ షోకి సైతం మేము సిద్ధం అంటున్నారు.

అలాంటి గ్లామరస్ బ్యూటీస్ లలో హీరోయిన్ గా ఒక్కో మెట్టు ఎక్కుతోన్న అందాల భామ రమ్య పసుపులేటి. ఈ అమ్మడు తాజాగా రిలీజ్ అయిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం సినిమాలో హీరోయిన్ గా మెరిసింది. తన అందంతో మూవీలో అందరిని ఆకట్టుకుంది. సినిమాకి కూడా పాజిటివ్ టాక్ రావడంతో రమ్య పేరు ఇప్పుడు గట్టిగానే వినబడుతోంది.

హుషారు సినిమాతో హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసిన రమ్య పసుపులేటి తరువాత ఫస్ట్ ర్యాంక్ రాజు, మైల్స్ ఆఫ్ లవ్, కమిట్ మెంట్ సినిమాలలో నటించింది. అయితే ఈ సినిమాలు రమ్యకి ఆశించిన స్థాయిలో గుర్తింపు తీసుకురాకపోయిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మాత్రం హీరోయిన్ గా కొంత బ్రేక్ ఇచ్చిందని చెప్పొచ్చు. నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాలో రమ్య పసుపులేటి నటిస్తోంది.

ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలుగా ఆమె పాత్ర ఉండబోతోంది. సినిమాలతో పాటుగా చదరంగం, BFF వెబ్ సిరీస్ లలో రమ్య పసుపులేటి నటించింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇన్ స్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామర్ పిక్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తుంది. ఈ ఫోటోలకి నెటిజన్లు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తూ ఉంటాయి. రమ్య అందానికి చాలా మంది ఫిదా అయిపోతూ ఉంటారు.

తాజాగా మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మూవీ ఈవెంట్ లో రమ్య పసుపులేటి లంగా ఓణీలో రమ్య పసుపులేటి సందడి చేసింది. ఈ ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతున్నాయి. చక్కనైన ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ లో అందాల అరవిందంలా రమ్య పసుపులేటి మెరిసిపోతుందనే మాట వినిపిస్తోంది. ఈ ఫోటోస్ ని రమ్య ఫ్యాన్స్ సోషల్ మీదకిలో షేర్ చేస్తున్నారు. చక్కనైన చిరునవ్వుతో కుందనాల బొమ్మలా రమ్య అందం ఉందనే ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    

Similar News