కల్కి.. మన హల్క్ కూడానా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ మరికొద్ది గంటల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

Update: 2024-06-26 07:29 GMT

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ మరికొద్ది గంటల్లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. హాలీవుడ్ రేంజ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమాపై వేరే లెవల్ లో అంచనాలు ఉన్నాయి. గ్రాఫిక్స్, విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ అలా అన్ని అంశాలు కూడా సమపాళ్లలో ఉంటాయని ఇప్పటికే మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా అందరికీ క్లారిటీ వచ్చేసింది.

ఇక ఈ సినిమాలో క్యాస్టింగ్ గురించి స్పెషల్ గా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా లెవెల్ లో అన్ని సినీ ఇండస్ట్రీల నటీనటులను రంగంలోకి దించేశారు మేకర్స్. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, పశుపతి, అన్నా బెన్, శోభన, మాళవిక నాయర్ సహా ఎందరో సినిమాలో భాగమయ్యారు. మరికొందరినీ డైరెక్ట్ గా స్క్రీన్ పై సర్ప్రైజింగ్ గా మేకర్స్ చూపించనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కల్కి మూవీలో టాలీవుడ్ హల్క్ రానా కూడా యాక్ట్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మేకర్స్ కావాలనే ఇప్పటి వరకు ఆయన రోల్ ను రివీల్ చేయలేదని టాక్ నడుస్తోంది. మహాభారతంలోని ఓ ప్రధాన పాత్రలో రానా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయం ఫుల్ ట్రెండ్ అవుతుండగా.. సినిమాపై అంచనాలు పెరుగుతున్నట్లు నెటిజన్లు చెబుతున్నారు.

కల్కిలో రానా దుర్యోధనుడి రోల్ పోషించినట్లు సినీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీనిపై ఇప్పటి వరకు మేకర్స్ అప్డేట్ ఇవ్వకపోయినా.. రానా నటించడం నిజమేనని అంటున్నారు సినీప్రియులు. అయితే ప్రభాస్, రానా మధ్య మంచి బాండింగ్ ఉన్న విషయం తెలిసిందే. బాహుబలి 1,2 చిత్రాల్లో రానా భల్లాలదేవగా అదరగొట్టేశారు. తన ఆహార్యం, నటనతో పాన్ ఇండియా లెవెల్ లో సినీ ప్రియులను అలరించారు. ఇప్పుడు దుర్యోధనుడిగా ఎలా ఉంటారో!

అయితే ఇటీవల ముంబైలో కల్కి ప్రీ లాంఛ్ ఈవెంట్ ను మేకర్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ వేడుకకు రానానే హోస్ట్ గా వ్యవహరించి సందడి చేశారు. దీంతో అప్పుడే రూమర్స్ మొదలవ్వగా.. ఇప్పుడు దుర్యోధనుడి రోల్ ను రానా చేశారని అంటున్నారు. క్యాస్టింగ్ ను ఎంపిక చేసుకోవడంలో మంచి పట్టు ఉన్న నాగ్ అశ్విన్.. రానాను రంగంలోకి దించారో లేదో మరికొన్ని గంటల్లో క్లారిటీ వచ్చేయనుంది.

Tags:    

Similar News