ఆ హీరోకి బిజినెస్ మ్యాన్ అంత క్లోజ్!
ఆకాష్ అంబానీ రణబీర్ క్లోజ్ ప్రెండ్ అట ఈ విషయాన్ని ఆకాష్ ఆంబానీ రివీల్ చేసాడు.
సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ప్రెండ్స్ ఎవరంటే? ఎక్కువగా సెలబ్రిటీలే కనిపిస్తారు. ఆహీరో-ఈ హీరో క్లోజ్ అంట అని..లేకపోతే ఆ హీరో-డైరెక్టర్ -నిర్మాత మధ్య మంచి సాన్నిహిత్యం ఉంటుందని వింటుంటాం. ఒకవేళ బయట వ్యక్తులు ఎవరైనా క్లోజ్ అయినా పెద్దగా హైలైట్ కారు. మీడియా..సోషల్ మీడియా ముందు కనిపించే వ్యక్తులు కాకపోవడంతోనే ఇలా జరుగతుంది.
మరి బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్- ఆకాశ్ ఆంబానీ ఎంత క్లోజ్ అన్నది ఎంత మందికి తెలుసు? బిజినెస్ టైకూన్ ముకేష్ అంబానీ-నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ. ఇతను రణబీర్ క్లోజ్ ప్రెండ్ అట. ఈ విషయాన్ని ఆకాష్ ఆంబానీ రివీల్ చేసాడు. నా బెస్ట్ ప్రెండ్ రణబీర్ కపూర్. ఇద్దరి రంగాలు పూర్తిగా వేర్వేరు. లక్ష్యాలు వేరు. కానీ చాలా క్లోజ్ ప్రెండ్స్ అయ్యాం. ఒకరంటే ఒకరు ప్రాణం.
ఇద్దరికి కాస్త సమయం దొరికినా కలిసి మాట్లాడుకుంటాం.మాటల మొదలైతే ఆ టాపిక్ ఎంతదూర మెళ్తుందో కూడా తెలియదు. మాజీ వితాల్లో మేము తీసుకునే నిర్ణయాల గురించి ఇంట్లో వాళ్ల కంటే ముందే మేము ఇద్దరం డిసైడ్ అవుతాం శ్లోకాతో ప్రేమ విషయంలో అదే జరిగింది. ఇంట్లో కంటే ముందుగా రణబీర్ కే ఈ విషయం చెప్పాను. అతనితో మాట్లాడి సలహాలు తీసుకున్నాను. ఆ తర్వాత రణబీర్ పెళ్లి ఏర్పాట్లన్నీ నేను దగ్గరుండి చూసుకున్నా.
మా స్నేహమంటే ఇంట్లో వారికి ఎంతో గౌరవం. రిషీకపూర్ అంకుల్ లుకేమియాతో బాధపడుతున్న సమయంలో నేను అందుబాటులో లేను. ఆ సమయంలో అమ్మ-నాన్న న్యూయార్క్ వెళ్లి రణబీర్ తో ఉన్నారు. నా బిజీని గుర్తించి వాళ్లకు వాళ్లగునా న్యూయార్క్ వెళ్లారు. అలా అమ్మ-నాన్న వెళ్లడంతో నా స్నేహితుడిగా మానసికంగా.. అండగా నేనే స్పాట్ లో ఉన్నాను అనిపించింది. నా విషయం లో రణబీర్ కూడా ఇలాగే స్పందిస్తాడు. ఇద్దరి మధ్య ఇలాంటి సందర్భాలెన్నో ఉన్నాయి' అని అన్నారు.