బాక్సాఫీస్.. రణబీర్ ముందున్న ఫస్ట్ టార్గెట్ ఇదే..

మూవీ ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి.

Update: 2023-11-27 04:41 GMT

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇప్పటి వరకు మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన సినిమాలు ఏవి అంటే వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. మొదటిగా బాహుబలి 2తో రాజమౌళి ఈ ఫీట్ అందుకున్నారు. ఆ సినిమా మొదటి రోజు వంద కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. తరువాత ఆర్ఆర్ఆర్ సినిమాతో మళ్ళీ ఆ రికార్డ్ ని సొంతం చేసుకున్నారు. బాహుబలి ఇచ్చిన సక్సెస్ కారణంగా ప్రభాస్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది.

ఈ కారణంగా ప్రభాస్ నుంచి తరువాత వచ్చిన సాహో, ఆదిపురుష్ సినిమాలో వందకోట్ల గ్రాస్ మొదటి రోజు వసూళ్లు చేశాయి. ఇలా ప్రభాస్ పేరు మీదనే మూడు సార్లు మొదటి రోజు వంద కోట్ల కలెక్షన్ రికార్డ్ ఉంది. ప్రభాస్ తర్వాత బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఈ ఫీట్ ని ఈ ఏడాదిలో బ్యాక్ టూ బ్యాక్ అందుకున్నారు. పఠాన్ మూవీ వంద కోట్ల మార్క్ ని ఫస్ట్ డేనే దాటింది.

అలాగే జవాన్ మూవీ కూడా వందకోట్లకి పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఈ ఇద్దరు హీరోలు తప్ప ఇంకెవరు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని సాధించలేదు. అయితే ఇప్పుడు ఆ అవకాశం రణబీర్ కపూర్ కి వచ్చింది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యానిమల్ సినిమాపై దేశ వ్యాప్తంగా మంచి హైప్ ఉంది.

మూవీ ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేసింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా భారీ ఎత్తున జరుగుతున్నాయి. సినిమాపై ఉన్న హైప్ కరెక్ట్ గా వర్క్ అవుట్ కచ్చితంగా యానిమల్ తో రణబీర్ కపూర్ వంద కోట్ల కలెక్షన్స్ మొదటి రోజు సొంతం చేసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే మొదటి రోజు వంద కోట్ల గ్రాస్ అందుకున్న మూడో హీరో రణబీర్ కపూర్ అవుతాడు.

ఇక ఈ ఏడాది సలార్ మూవీతో ప్రభాస్, డుంకీతో షారుఖ్ ఖాన్ మరోసారి తమ ఖాతాలో ఫస్ట్ డే వంద కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని వేసుకోవడానికి రెడీ అవుతున్నారు. డిసెంబర్ లోనే ఈ మూడు సినిమాలు కూడా వస్తూ ఉండటం విశేషం.

Tags:    

Similar News