మహేష్ సినిమాలో రణబీర్?
ఆసక్తికరంగా ఈ ఈవెంట్‌లో రణబీర్ కపూర్ రాజమౌళి పాదాలను తాకి ఆశీర్వాదం అందుకున్నారు. జక్కన్న రణబీర్ ని బ్లెస్ చేయడమే కాదు వామ్ హగ్ ఇచ్చి అతడిని ఖుషీ చేసాడు.
యానిమల్ మేకర్స్ సోమవారం హైదరాబాద్‌లో అభిమానులు, మీడియాతో సంభాషించడానికి భారీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. రణబీర్ కపూర్ - అనిల్ కపూర్ లాంటి ప్రముఖులు ఉన్న ఈ వేదికపై ముఖ్య అతిథులుగా దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కనిపించారు. వారు యానిమల్ బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. యానిమల్ టీజర్ ట్రైలర్ గురించి ప్రశంసలు కురిపించారు.
ఆసక్తికరంగా ఈ ఈవెంట్‌లో రణబీర్ కపూర్ రాజమౌళి పాదాలను తాకి ఆశీర్వాదం అందుకున్నారు. జక్కన్న రణబీర్ ని బ్లెస్ చేయడమే కాదు వామ్ హగ్ ఇచ్చి అతడిని ఖుషీ చేసాడు. ఇక ఇదే వేదిక వద్ద మహేష్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ ను కౌగిలించుకుని పలకరించాడు. రణబీర్ జక్కన్న ఆశీర్వాదాలు అందుకుంటున్న ఆ వీడియో వైరల్ అయిన వెంటనే, రణబీర్ కపూర్ అభిమానులు 'అతడు దేశీ వ్యక్తి' అని షేర్ చేశారు. మరో నెటిజన్.."సినిమా విడుదలకు ముందు SS రాజమౌళి నుండి RK ఆశీర్వాదం తీసుకున్నారు. ఆశీర్వాదం సరే జక్కన్న తన తదుపరి చిత్రంలో రణబీర్ కి అవకాశం కల్పిస్తారా?" అంటూ ప్రశ్నించారు. మహేష్ తో తదుపరి భారీ యాక్షన్ చిత్రానికి ప్లాన్ చేస్తున్న రాజమౌళికి ఇందులో రణబీర్ లాంటి ప్రతిభావంతుడికి అవకాశం కల్పించడం కష్టమేమీ కాదు. కానీ అది జరుగుతుందా? అన్నది చూడాలి.
RRR దర్శకుడు రాజమౌళి ఇదే వేదికపై రణబీర్ తన అభిమాన నటుడు అని ప్రకటించారు. బాలీవుడ్ లో మీ ఫేవరెట్ నటుడు ఎవరు? అంటే ఎటువంటి సంకోచం లేకుండా నేను చెప్పగలను. నా అభిమాన నటుడు రణబీర్ కపూర్ అని రాజమౌళి అన్నారు. అందుకే మహేష్ బాబు నటించనున్న తదుపరి పాన్ ఇండియా చిత్రంలో రణబీర్ కి కూడా రాజమౌళి అవకాశం కల్పిస్తే అది ఈ మూవీకి మరింత క్రేజ్ పెంచుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం యూనివర్శ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. కనీసం భవిష్యత్ లో అయినా ఈ మేలైన కలయిక ఉంటుందనే అభిమానులు ఆశిస్తున్నారు. టాలీవుడ్ చాక్లెట్ బోయ్ మహేష్ బాబు, బాలీవుడ్ చాక్లెట్ బోయ్ లవర్ బోయ్ రణబీర్ ల కలయిక సాధ్యమవుతుందనే ఆశిద్దాం.
అతడిలో జంతు ప్రవృత్తి ఎందుకు?
యానిమల్ గురించి మాట్లాడుకుంటే.. దీనికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో రణబీర్ కపూర్, అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ఇటీవల, చెన్నైలో జరిగిన ప్రచార కార్యక్రమంలో, రణబీర్ ఈ దర్శకత్వానికి యానిమల్ అనే పేరు ఎందుకు పెట్టారో తెలిపాడు. ఒక్కసారి సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది అని రణబీర్ అన్నారు. సందీప్ రెడ్డి వంగా ఈ చిత్రానికి యానిమల్ అని పేరు పెట్టడానికి కారణం జంతువుల ప్రవృత్తితో ప్రవర్తించడమే అని నేను అనుకుంటున్నాను. అవి ఆలోచన నుండి బయటపడవు. కాబట్టి నేను చేస్తున్న ఈ పాత్ర అలానే ప్రవర్తిస్తుంది. కథానాయకుడు తన కుటుంబాన్ని రక్షించడానికి జంతు ప్రవృత్తిని కలిగి ఉంటాడు. అతడు ప్రవృత్తి లేకుండా ప్రవర్తిస్తున్నాడని అనుకోలేం. అతడు ఉద్రేకపూరితంగా ఉంటాడు.. ఇక్కడే 'యానిమల్' అనే టైటిల్ వచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు సినిమా చూసిన తర్వాత ఈ చిత్రం ఈ టైటిల్‌కు సరిపోతుందని గ్రహిస్తారు.. అని అన్నాడు.
రీసెంట్‌గా యానిమల్ టీమ్ ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్‌ను విడుదల చేసింది. దీనికి అభిమానుల నుండి భారీ స్పందన వచ్చింది. 3 నిమిషాల 32 సెకన్ల ట్రైలర్ రణబీర్ చిన్న వయస్సులో హింసాత్మకంగా పెరిగిన కారణంగా అతని పాత్ర తీరుతెన్నుల్లో యానిమల్ ప్రవృత్తి కనిపిస్తుందని ట్రైలర్ వెల్లడించింది. రణ్‌బీర్ పాత్ర తన తండ్రి ప్రేమకు రక్షణగా అబ్సెసివ్‌గా ఉంటుంది. తన తండ్రిపై ప్రేమకు అడ్డుగా వచ్చిన ప్రతి ఒక్కరినీ బెదిరిస్తూ కనిపిస్తాడు. ఈ సినిమా 3 గంటల 21 నిమిషాల నిడివితో ఉందని సమాచారం. యానిమల్ డిసెంబర్ 1న థియేటర్లలోకి వస్తోంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం లో విడుదల కానుంది.