టాలీవుడ్.. షారుక్ తరువాత రణబీర్ కు బెస్ట్ ఛాన్స్
ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ లెక్కలు అర్థం చేసుకున్న హిందీ దర్శక నిర్మాతలు తమ సినిమాలను కచ్చితంగా తెలుగు భాషలో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సినిమాలు కూడా తెలుగులో డబ్ అవుతూ ప్రేక్షకులను అలరిస్తున్న సంగతి తెలిసిందే. సినిమాలకి పాన్ ఇండియా ఇమేజ్ వచ్చిన తర్వాత సౌత్ హీరోలు నార్త్ ఇండియాలో సక్సెస్ అవుతున్నారు. అలాగే నార్త్ ఇండియా హీరోలైన షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, రణబీర్ కపూర్, హృతిక్ రోషన్ లాంటి స్టార్స్ సౌత్ లో కూడా తమ ఇమేజ్ బిల్డ్ చేసుకొని మార్కెట్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వారి సినిమాలకు తెలుగులో కూడా కొంతమేరకు ఆదరణ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో మార్కెట్ లెక్కలు అర్థం చేసుకున్న హిందీ దర్శక నిర్మాతలు తమ సినిమాలను కచ్చితంగా తెలుగు భాషలో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్య సౌత్ దర్శకులతో హిందీలో స్టార్ హీరోలు సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడానికి మార్కెట్ లెక్కలు కూడా ఒక కారణం అని చెప్పొచ్చు.
యానిమల్ రిలీజ్ తర్వాత తెలుగు రాష్ట్రాల్లో టాప్ 4 హిందీ సినిమాల్లో రెండు షారుక్ ఖాన్ సినిమాలు ఉంటే మరో రెండు రణబీర్ కపూర్ మూవీస్ ఉంటాయని చెప్పొచ్చు. రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర సినిమా తెలుగులో మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు యానిమల్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వస్తూ ఉండడంతో కచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయి కలెక్షన్స్ కొల్లగొట్టడం ఖాయం అనే మాట వినిపిస్తోంది.
ఈ ఏడాదిలో షారుక్ ఖాన్ పఠాన్ సినిమాతో తెలుగులో బీభత్సమైన సక్సెస్ అందుకున్నారు. తర్వాత అత్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. షారుఖ్ తర్వాత రణబీర్ కపూర్ తెలుగు రాష్ట్రాలలో గత కొన్నేళ్ళుగా పాపులారిటీ పెంచుకుంటున్నారు. యానిమల్ ఓపెనింగ్స్ తో కచ్చితంగా అతని ఇమేజ్ ఏ మాత్రం పెరిగింది అనేది క్లారిటీ వస్తుంది.
గతంలో క్రిష్ సిరీస్ తో హృతిక్ రోషన్ తెలుగులో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న ఆ తర్వాత దానిని కొనసాగించలేకపోయారు. మరి రణబీర్ కపూర్ తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ సక్సెస్ ఫుల్ బాలీవుడ్ హీరో అనిపించుకుంటాడా లేదా అనేది యానిమల్ సినిమాతో తెలిసిపోనుంది. ఈ సినిమా హిట్ అయితే మాత్రం కచ్చితంగా తెలుగులో తనకంటూ ఒక మార్కెట్ ని రణబీర్ కపూర్ క్రియేట్ చేసుకుని ఛాన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తున్న మాట.