గోపిచంద్ బాలీవుడ్ ప్రాజెక్ట్.. రంగంలోకి మరో స్టార్ యాక్టర్

టాలీవుడ్‌లో మన మాస్ దర్శకులు బాలీవుడ్‌లో కూడా తమదైన ముద్ర వేస్తున్నారు.

Update: 2024-08-20 08:32 GMT

టాలీవుడ్‌లో మన మాస్ దర్శకులు బాలీవుడ్‌లో కూడా తమదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటి వరకు రణబీర్ కపూర్‌తో సందీప్ రెడ్డి వంగ సూపర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ లిస్ట్‌లో మరో దర్శకుడు గోపీచంద్ మలినేని చేరారు. ఆయన బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్‌తో కలిసి పాన్ ఇండియా సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌పై మంచి హైప్ ఉండగా, తాజాగా మేకర్స్ మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్‌ను అందించారు.


ఇప్పటికే ఈ సినిమాలో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా, తాజాగా మరో బాలీవుడ్ స్టార్ రణదీప్ హూడా కూడా ఈ సినిమాలో చేరారు. రణదీప్ హూడా తన పాత్ర గురించి ప్రత్యేకమైన వివరాలు తెలియకపోయినా, ఈ సినిమా కోసం ఒక కీలక పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. రణదీప్, సన్నీ డియోల్ కాంబినేషన్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఈ చిత్రానికి థమన్ సంగీతం అందించబోతున్నాడు, అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం చేపట్టిన ఈ సినిమా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతుంది. గోపీచంద్ మలినేని ఈ సినిమాతో బాలీవుడ్‌లో తన ఎంట్రీ ఇస్తుండటంతో, ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా రెగ్యులర్ షూటింగ్ జూన్ 22 నుంచి ప్రారంభమవుతుంది. సినిమా యూనిట్ అందిస్తున్న అప్డేట్స్ చూస్తుంటే, ఇది గోపీచంద్ మలినేని కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్ అవుతుందని అనిపిస్తుంది.

గోపీచంద్ మలినేని ఎలాంటి సినిమా చేసిన కూడా అందులో మాస్ మసాలా కమర్షియల్ ఎలిమెంట్స్ గట్టిగా ఉంటాయి అని చెప్పవచ్చు. ఇక బాలీవుడ్ సినిమాలో కూడా యాక్షన్ ఎలిమెంట్స్ ను గట్టిగానే చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. అసలైతే ఇంతకుముందు గోపీచంద్ రవితేజతో ఒక సినిమా చేయాలనుకున్నాడు. అయితే ఎందుకో ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి మళ్ళీ సన్నీ డియోల్ తో కొత్త ప్రాజెక్టును మొదలుపెట్టారు.

ఇంతకుముందు గోపీచంద్ మలినేని బాలకృష్ణతో వీర సింహారెడ్డి అనే సినిమా చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 100 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకని అతని కెరీర్ కు మరింత బూస్ట్ ఇచ్చింది. ఇంతకుముందు క్రాక్ సినిమాతో కూడా సాలీడ్ సక్సెస్ అందుకున్నాడు. వరుస కమర్షియల్ సక్సెస్ లతో గోపీచంద్ తన మార్కెట్ ను పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇక ఇప్పుడు ఈ బాలీవుడ్ ప్రాజెక్టుతో కూడా మరో స్థాయికి వెళ్లాలని అనుకుంటున్నాడు. మరి అతనికి ఈ కొత్త ప్రాజెక్టు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News