కపుల్స్ మధ్యలో ఒర్రీ బేబి బంప్!
అబ్బాయ్ పుడతాడా? అమ్మాయి పుడుతుందా? అన్న ఎగ్జైట్ మెంట్ లో రణవీర్ సింగ్ కపుల్స్ కనిపిస్తున్నారు.
అతి త్వరలోనే దీపికా పదుకోణే మామ్ కాబోతుంది. పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది. పాపాయి బయటకు వచ్చిన తర్వాత ఎలా చూసుకోవాలో ఇప్పటి నుంచి ప్రణాళికలు వేసుకుంటుంది. అబ్బాయ్ పుడతాడా? అమ్మాయి పుడుతుందా? అన్న ఎగ్జైట్ మెంట్ లో రణవీర్ సింగ్ కపుల్స్ కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఆ క్షణాల్ని ఆస్వాదిస్తున్నారు. ఇక దీపిక అత్యవసరమైతే తప్ప బయట కనిపించడం లేదు.
వీలైనంతగా కుటుంబ సభ్యుల సంరక్షణలోనే ఉంటుంది. పాపాయిపై ఎలాంటి ఒత్తిడి పడకుండా అన్ని రకాలు జాగ్రత్తలు తీసుకుంటుంది. ఓ భర్తగా రణవీర్ అంతే ప్రేమని పంచుతున్నాడు. షూటింగ్ ఉంటే సెట్ లో ..లేదంటే ఇంట్లో దీపికతోనే సమయాన్ని గడుపుతున్నాడు. తాజాగా ఆ అందమైన జంట మధ్యలో ఒర్రీ తళుక్కున మెరిసాడు. రణవీర్ సింగ్-దీపికా పదుకొణే ఏదో ఈవెంట్ కి హాజరైన సమయంలో ఒర్రీ హాయ్ అంటూ ఆ జంట మధ్యలోకి దూరిపోయాడు.
ఇదిగో ఇక్కడిలో దీపిక బేబే బంప్ పై చేతులేసి బేబి జాగ్రత్త అంటూ సూచనలు చేసాడు. దీపికకు సోదరులు ఉన్నారో? లేదో గానీ...ఆ ప్రేమని మాత్రం ఒర్రీ ఈ విధంగా తీర్చేసాడు. అక్కా-బావ మధ్యలో బామ్మర్ది హైలైట్ అయినట్లు అయ్యాడు. ఇందులో దీపిక బ్లూ కలర్ చీర కట్టుకుని కనిపిస్తుంది. రణవీర్ సింగ్ వైట్ కలర్ డిజైనర్ దుస్తుల్లో అంతే మనోహారంగా ముస్తాబయ్యాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
ఇక ఒర్రీ గురించి తెలిసిందే. సినిమా నటుడు కాకపోయినా బాలీవుడ్ సెలబ్రిటీలందరితో ఎంతో క్లోజ్ గా మూవ్ అవుతాడు. వాళ్లు అతడిని తమలో వ్యక్తిగా భావిస్తారు. హీరోయిన్లతో కలిసి నైట్ పార్టీలకు వెళ్తుం టాడు. వాళ్లందరి బెస్టీగా అందర్నీ మురిపిస్తుంటాడు. ప్రస్తుతం అంబానీ ఇంట పెళ్లి వేడుకలో సెలబ్రిటీ లందరితో ఫోటోలు దిగుతూ కనిపిస్తున్నాడు.