భార్య డిప్రెషన్‌పై స్టార్ హీరో దిగులు?
కాఫీ విత్ కరణ్ కొత్త సీజన్ మరోసారి సెలబ్రిటీల గుట్టు మట్లను బయటపెట్టేందుకు వచ్చింది.
కాఫీ విత్ కరణ్ కొత్త సీజన్ మరోసారి సెలబ్రిటీల గుట్టు మట్లను బయటపెట్టేందుకు వచ్చింది. ఇంతకుముందే రణవీర్- దీపిక దంపతులపై టీజర్ రిలీజ్ కాగా వెబ్ లోకి దూసుకెళ్లింది. రణ్ వీర్.. దీపిక గతంలో కరణ్ షోకి విడివిడిగా మాత్రమే వెళ్లారు. ఎన్నడూ కలిసి వెళ్లలేదు. ఇప్పుడు పెళ్లయిన తర్వాత ఈ జంట తొలిసారి కరణ్ షోలో పాల్గొనడం ఆసక్తిని కలిగించింది. కాఫీ విత్ కరణ్ షోలో కరణ్ ఈ జంటను చాలా ప్రశ్నలు అడిగారు. అందులో దీపిక పదుకొనే డిప్రెషన్ గురించిన ప్రశ్న కూడా ఉంది.
బాలీవుడ్ అగ్రనాయిక దీపికా పదుకొణె గతంలో డిప్రెషన్‌తో పోరాడింది. స్వయంగా తన ఇంటర్వ్యూలలో దాని గురించి వెల్లడించింది. ఇప్పుడు కరణ్ ఇదే విషయాన్ని ప్రస్థావిస్తూ రణ్ వీర్ ని అడిగారు. వారిలో ఒకరు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నారని ..కుటుంబం మొత్తం ప్రభావితమవుతుందని కరణ్ అన్నారు. దీనికి రణ్ వీర్ సమాధానం ఇస్తూ.. ``డిప్రెషన్‌తో పోరాడుతున్న వ్యక్తిని మనం చాలా జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. దీపిక పరిస్థితిని అర్థం చేసుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది. 2014లో ఆమె ఫోన్ చేసి ఇంటికి రమ్మని అడగింది. పరిస్థితి సరిగ్గా లేదని నేను భావించాను. దీపిక నాతో ఉంది కానీ లేదు. ఆమె చాలాసార్లు ఏడుస్తోంది. నేను నిస్సహాయంగా ఉన్నాను. నేను తన కుటుంబాన్ని పిలిపించగా, ముంబైకి వచ్చారు`` అని కూడా తెలిపాడు.
ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం
దీపికా పదుకొణె తన జీవితంలో డిప్రెషన్ తో బాధపడడం..దానితో పారాటం గురించి గతంలో ధైర్యంగా మాట్లాడారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయం చేయడానికి దీపిక `లైవ్ లవ్ లాఫ్` అనే NGOని కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్జీవో సమావేశంలో తాను డిప్రెషన్ తో ఎలా పోరాడిందో మాట్లాడింది. ఈ లక్షణాలను తన తల్లి తొలిగా అర్థం చేసుకున్నారని తెలిపింది. ఆత్మహత్య ఆలోచనలు ఉన్నట్లు మాట్లాడుతున్నప్పుడు మానసికంగా కుంగిపోయిన తనను తన తల్లి గారు అర్థం చేసుకున్నారని తెలిపారు.
``నేను కెరీర్-అత్యున్నత స్థాయికి చేరుకున్నాను.. ప్రతిదీ బాగానే ఉంది.. కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాలని అనుకోవడానికి స్పష్టమైన కారణం లేదు. కానీ నేను చాలా బ్రేక్ అయ్యాను. నేను నిద్రపోవాలనుకున్న రోజులు ఉన్నాయి.. ఎందుకంటే నిద్ర పట్టేది కాదు.. తప్పించుకోలేకపోయేదానిని. నేను కొన్ని సమయాల్లో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఇలాంటి వాటన్నింటిని ఎదుర్కోవలసి వచ్చింది. నా తల్లిదండ్రులు బెంగుళూరులో నివశిస్తున్నారు. వారు నన్ను సందర్శించినప్పుడు నేను బాగానే ఉన్నానని వారికి చూపించాలని తరచుగా ధైర్యంగా ఉండేదానిని. చివరిరోజు నా తల్లిదండ్రులు బయలుదేరి బెంగుళూరుకు వెళ్తున్నారు. నాకు అకస్మాత్తుగా ఏడుపు (బ్రేక్ డౌన్)వచ్చింది. మా అమ్మ నన్ను బాయ్ ఫ్రెండ్ లేదా ఏదైనా సమస్య ఉందా? లేదా ఇంకేదైనా జరిగిందా? అని సాధారణ ప్రశ్నలు అడిగారు. నా దగ్గర సమాధానం లేదు.. ఎందుకంటే ఇది ఏదీ కాదు.. అది ఖాళీగా ఉన్న ప్లేస్ నుండి పుట్టుకొచ్చిన ఒత్తిడి. అది నాకు తెలుసు. దేవుడు నా కోసం వారిని పంపాడు. ఈ సంకేతాలు లక్షణాలను అర్థం చేసుకున్నందుకు నా తల్లికి నేను క్రెడిట్ మొత్తం ఇస్తాను`` అని ఓపెన్ గా మాట్లాడారు.
ఒత్తిడిని జయించలేని బలహీనత గురించి వెల్లడించేందుకు దీపిక సిగ్గుపడలేదు. ఈ క్వాలిటీనే తనను అత్యంత ధీశాలిగా నిలబెట్టింది. ఇంత ఎదిగాక ఇప్పుడు కూడా మానసిక అనారోగ్యం గురించి మాట్లాడటం అంత సులభం కాదు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాటిని అర్థం చేసుకోలేని వారు చాలా మంది ఉన్నారు.