ఆంటీ అని పిలువ్ నో ప్రాబ్లెమ్: తమన్నా
ఇదిగో ఇక్కడ తమన్నాను చూస్తే మీకే అర్థమవుతుంది. పబ్లిక్ లో పది మంది ముందూ `ఆంటీ` అని పిలిచేసింది ఈ అందమైన అమ్మాయి
ఎవరైనా అందాల కథానాయికను `ఆంటీ` అని పదిమందిలో పిలిచేస్తే తన ఫీలింగ్స్‌ని అంచనా వేయగలరా? ఈగోయిస్టిక్ ప్రపంచంలో ప్రతిదానికీ భావోద్వేగాలు దెబ్బ తింటున్నాయ్. చాలా చిన్న విషయాలకే కోపతాపాలు పుట్టుకొచ్చేస్తున్నాయ్! ఇలాంటి అల్ట్రా స్పీడ్ ప్రపంచంలో .. అందునా అగ్ర కథానాయికగా రంగుల పరిశ్రమలో పెద్ద హోదాను అందుకున్న ఒక నటిని `ఆంటీ?` అని పబ్లిక్ లోనే పిలిచేస్తే, తన ఫీలింగ్ ఏమిటో ఎలా తెలుస్తుంది?
ఇదిగో ఇక్కడ తమన్నాను చూస్తే మీకే అర్థమవుతుంది. పబ్లిక్ లో పది మంది ముందూ `ఆంటీ` అని పిలిచేసింది ఈ అందమైన అమ్మాయి. ఇంకా టీనేజ్ లో ఉన్న రాషా తడానీ తన డెబ్యూ సినిమా `అజాద్` ప్రివ్యూ షో సమయంలో తమన్నాను ఆంటీ అని పిలిచేసింది. అసలు అలా పిలవాలా వద్దా? అనే సందిగ్ధత తనకు ఉంది. అయినా ఆ క్షణం ఆ పిలుపు అలా సహజంగా వచ్చేసింది.
అయితే తమన్నా దీనికి ప్రతిస్పందించిన తీరు ఎంతో హుందాగా ఉంది. ఆంటీ అని పిలిచావా? అయితే పిలువ్.. తప్పేమీ లేదు! అంటూ తమన్నా యువనటిని సముదాయించిందే కానీ, ఎక్కడా కోపగించుకోలేదు. ఈగోలకు పోలేదు. తను విపరీతంగా అభిమానించే రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ డెబ్యూ సినిమా బాగా ఆడాలని తమన్నా కోరుకుంది. అయినా 2000 సంవత్సరంలో `శ్రీ` అనే సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన తమన్నా.. 25 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని కొనసాగించింది. తమన్నా వయసు 35. అంటే... పదేళ్ల వయసు నుంచే తమన్నా నటిగా కెరీర్ ని మొదలు పెట్టి అంచెలంచెలుగా ఎదిగిందన్నమాట.