మోక్షజ్ఞ డెబ్యూ.. జోడిగా వచ్చేదెవరు?

ప్రస్తుతం మోక్షజ్ఞకి హీరోయిన్ ని వెతికే పనిలో ప్రశాంత్ వర్మ ఉన్నారు.

Update: 2024-10-28 10:22 GMT

నందమూరి నటసింహం బాలకృష్ణ వారుసుడు మోక్షజ్ఞ హీరోగా తెరంగేట్రం కన్ఫర్మ్ అయిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి చిత్రం రాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. డిసెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందనే ప్రచారం నడుస్తోంది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది.

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కనున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరనేది ఇంకా ఫైనల్ కాలేదు. ప్రస్తుతం మోక్షజ్ఞకి హీరోయిన్ ని వెతికే పనిలో ప్రశాంత్ వర్మ ఉన్నారు. మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అయిన కూడా ఈ సినిమాకి హిందీలో కూడా మంచి లాంచింగ్ గా ఉండాలనే ప్లాన్ తో ప్రశాంత్ వర్మ క్యాస్టింగ్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. అందులో భాగంగా ఈ మూవీ హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ సెలబ్రెటీ కుటుంబాలకి చెందిన వారసురాలిని ఎంపిక చేయాలని అనుకుంటున్నాడు.

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ కూతురు రషా తడానిని హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే ఇందులో ఎలాంటి వాస్తవం లేదనే మాట వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ ఇంకా హీరోయిన్ ని కన్ఫర్మ్ చేయలేదనే టాక్ నడుస్తోంది. అయితే బాలీవుడ్ స్టార్స్ వారసురాలిని హీరోయిన్ గా తీసుకోవాలని ప్రయత్నం అయితే చేస్తున్నారంట. త్వరలో హీరోయిన్ ఎవరనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కాబట్టి అతని ఇమేజ్ కి సరిపోయే విధంగానే హీరోయిన్ ఉండాలని ప్రశాంత్ వర్మ టీమ్ భావిస్తోంది. అలాగే స్టార్ యాక్టర్ ని ప్రతినాయకుడిగా ఎంపిక చేయబోతున్నారంట. ఈ మూవీ కథాంశం మైథాలజీతో పాటు ప్రెజెంట్ కల్చర్ ని మిక్స్ చేస్తూ సూపర్ హీరో కాన్సెప్ట్ తోనే ఉండబోతోందంట. అందుకే విజువల్ ఎఫెక్ట్స్ వర్క్ కూడా ఈ చిత్రంలో ఎక్కువగానే ఉండబోతోందనే మాట వినిపిస్తోంది.

సినిమాకు సుమారు 100 కోట్లకి పైగా బడ్జెట్ అయిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారు. ఈ సినిమాని సుధాకర్ చెరుకూరి, తేజస్విని నందమూరి భారీ బడ్జెట్ తో తో నిర్మిస్తున్నారు. ప్రశాంత్ వర్మ ఈ చిత్రంతో పాటు ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ కూడా స్టార్ట్ చేయబోతున్నాడు. అయితే ఆ మూవీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందనేది దీపావళికి తెలిసే అవకాశం ఉందని టాక్ నడుస్తోంది.

Tags:    

Similar News