కజిన్ పెళ్లిలో రాశీ సందడి చూసారంటే..!
నిజానికి ఈ భామ ఎవరో పరిచయం చేయాల్సిన పని లేదు. అందరి హృదయాల్లో నిలిచిన అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా.
నుదిటిన పాపిడి బొట్టు.. చెవులకు లోలాకులు.. చేతులకు ముత్యాల హారాలు.. వీటన్నిటికంటే ఛమత్కారంగా కళ్లకు బ్రౌనీ గాగుల్.. చూడగానే సాంప్రదాయం ఉట్టిపడే అందమైన డిజైనర్ లెహంగా.. ఇంతకీ ఎవరీ భామ? ఏమిటీ కొత్త వింత! అంటారా?
నిజానికి ఈ భామ ఎవరో పరిచయం చేయాల్సిన పని లేదు. అందరి హృదయాల్లో నిలిచిన అందాల ముద్దుగుమ్మ రాశీ ఖన్నా. తెలుగు, తమిళంలో యువహీరోల సరసన నటించిన ఈ బ్యూటీ కెరీర్ పరంగా డోఖా లేకుండా ముందుకు సాగుతోంది. ఇటీవల హిందీలోను రాశీ అవకాశాలు అందుకుంటోంది. షాహిద్ సరసన ఫర్జీ లాంటి వెబ్ సిరీస్ లో నటించిన రాశీ ఖన్నా తదుపరి భారీ సినిమాల్లోను అవకాశాలు అందుకుంది.
ఇంతలోనే చిన్న పాటి గ్యాప్ లో కజిన్ పెళ్లికి అటెండయింది. ఆకాశంలో చుక్కలన్నీ కిందికి జారిపడి రాశిగా పోసినట్టుగా అందం అంతా ఒకే చోట పోగైతే అది రాశీ ఖన్నా అన్న చందంగా ఈ లుక్కు కనిపిస్తోంది. కజిన్ పెళ్లికి కొత్త కళ తెచ్చింది రాశీ. ఇదిగో ఫోటోసెషన్ లో తన కజిన్ బ్రదర్ తో ఎంతో చిద్విలాసంగా నవ్వులు చిందిస్తూ కనిపించింది. ముఖ్యంగా రాశీఖన్నా సాంప్రదాయ దుస్తులు అందరినీ ఆకర్షిస్తున్నాయి. పర్ఫెక్ట్ వెడ్డింగ్ వేర్ అంటే ఏమిటో తన ఎంపికను చూస్తే అర్థమవుతోంది. హిల్ స్టేషన్ వెడ్డింగ్ కావడంతో రాశీ ఖన్నా కుటుంబం అంతా జాలీగా సెలబ్రేషన్ ని ఆస్వాధించిందని ఈ ఫోటోలను బట్టి అర్థమవుతోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే సిద్ధార్థ్ మల్హోత్రా సరసన నటించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ యోధ విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో రాశీ ఖన్నా పాత్రకు ప్రాధాన్యత ఉంది. విమానాన్ని హైజాక్ చేసిన తీవ్రవాదుల నుంచి ప్రయాణీకులను కాపాడే యోధుడి కథతో ఇది తెరకెక్కింది. ఇందులో విమానయాన సిబ్బంధి పాత్రలో రాశీ నటించింది.