ఆ స్టార్ హీరో 24 లో పాన్ ఇండియా సంచలనం!
ఇటీవల రిలీజ్ అయిన కోలీవుడ్ చిత్రం `అమరన్` ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే.
ఇటీవల రిలీజ్ అయిన కోలీవుడ్ చిత్రం `అమరన్` ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో తెలిసిందే. 200 కోట్లకు పై గా వసూళ్లను రాబట్టి శివకార్తికేయన్ కెరీర్ లో తొలి భారీ వసూళ్లు చిత్రంగా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి స్పందన లభించింది. మేజర్ వరదరాజ్ ముకుందన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమాకి మ్యూజిక్ కూడా కలిసొచ్చింది. ఇలా అన్ని కలిసి రావడంతోనే ఇంత పెద్ద విజయం నమోదు చేయగలగింది.
ఈ ఫలితంతో శివకార్తికేయన్ మార్కెట్ కూడా భారీగా పెరిగింది. తెలుగులో ఆయన సినిమాలకు మంచి డిమాడ్ క్రియేట్ అవుతుంది. తాజాగా ఆయన 24వ చిత్రం లాక్ అయింది. శిబి చక్రవర్తి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తు న్నాడు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ లో `డాన్` అనే చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. తాజా ప్రాజెక్ట్ తో రెండవ సారి చేతులు కలుపుతున్నారు. ఫ్యాషన్ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.
మరి ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు? అంటే నేషనల్ క్రష్ రష్మిక మందన్నని తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే దర్శకుడు ఆమెకు స్టోరీ వినిపించగా పాత్ర నచ్చడంతో అంగీకరించినట్లు సమాచారం. ఇందులో అమ్మడి పాత్ర రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా ఉంటుందని అంటున్నారు. ఇంత వరకూ రష్మిక ఇలాంటి పాత్ర పోషించలేదని... సరికొత్త కోణంలో ఆమె పాత్ర సాగుతుందని సమాచారం. రష్మిక ఎంట్రీ సినిమాకు బాగా కలిసొచ్చే అంశం. `పుష్ప-2` విజయంతో ఆమె క్రేజ్ మరింత రెట్టింపు అయింది.
ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ జనవరి లో ప్రారంభం అవుతుందిట. అలాగే ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం శివ కార్తికేయన్ హీరోగా మురగదాస్ ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత శిబి చక్రవర్తి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.