అల్లు అర్జున్‌ గురించి రష్మిక కామెంట్స్‌...!

అల్లు అర్జున్‌తో పుష్ప, పుష్ప 2 సినిమాల్లో ఈమె నటించింది. రెండు సినిమాల్లోనూ అల్లు అర్జున్‌తో పోటీ పడి మరీ రష్మిక నటించింది.

Update: 2025-02-13 05:30 GMT

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉంది. గత ఏడాది చివర్లో అల్లు అర్జున్‌తో కలిసి నటించిన 'పుష్ప 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రష్మిక మందన్న రేపు 'చావా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బాలీవుడ్‌ స్టార్‌ నటుడు విక్కీ కౌశల్‌ హీరోగా నటించిన ఆ సినిమాలో రష్మిక హీరోయిన్‌గా నటించింది. చావా సినిమా ప్రమోషన్స్‌లో రష్మిక మందన్న గత రెండు వారాలుగా పాల్గొంటుంది. కాలికి గాయం అయినా వీల్‌ చైర్‌లో తిరుగుతూ మరీ సినిమా ప్రమోషన్స్‌కి తనవంతు సహకారం అందిస్తున్న విషయం తెల్సిందే.

'చావా' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రష్మిక మందన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను వర్క్ చేసిన హీరోల గురించి చెప్పుకొచ్చింది. అల్లు అర్జున్‌తో పుష్ప, పుష్ప 2 సినిమాల్లో ఈమె నటించింది. రెండు సినిమాల్లోనూ అల్లు అర్జున్‌తో పోటీ పడి మరీ రష్మిక నటించింది. అల్లు అర్జున్‌ గురించి రష్మిక మాట్లాడుతూ.. అల్లు అర్జున్‌లో అద్భుతమైన ప్రతిభ ఉంది. అతడితో వర్క్ చేస్తున్నప్పుడు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఎక్కువ రోజులు ఆయనతో వర్క్ చేసిన అనుభవం తనకు ఉందని, ఆయనతో చేసే ప్రతి సీన్‌ను ఎంజాయ్‌ చేస్తూ నటించినట్లు రష్మిక మందన్న చెప్పుకొచ్చింది.

రణబీర్‌ కపూర్‌తో రష్మిక 'యానిమల్‌' సినిమాలో నటించింది. ఆ సినిమాలో రష్మిక కాస్త డోస్ పెంచి రొమాంటిక్ సన్నివేశాల్లోనూ నటించిన విషయం తెల్సిందే. రణబీర్ కపూర్‌ గురించి రష్మిక మాట్లాడుతూ.. రణబీర్‌ అందరితోనూ చాలా కలివిడిగా ఉంటారు. ఆయనతో కలిసి వర్క్‌ చేయడంను ఎంజాయ్ చేశాను. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాకుండా మంచి వ్యక్తి అని రష్మిక చెప్పుకొచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ నటిస్తున్న సికిందర్ సినిమాలోనూ ఈ అమ్మడు నటిస్తున్న విషయం తెల్సిందే. యానిమల్‌ హిట్‌తో బాలీవుడ్‌లో ఈ అమ్మడు వరుస సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకుంటుంది.

బ్యాక్ టు బ్యాక్ యానిమల్‌, పుష్ప 2 సినిమాలతో భారీ విజయాలను సొంతం చేసుకోవడం ద్వారా చావా సినిమాకి మంచి బజ్ క్రియేట్‌ అయ్యింది. చత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమాను రూపొందించారు. శంభాజీ భార్య పాత్రలో రష్మిక మందన్న నటించింది. చావా సినిమా పై బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు సౌత్‌లోనూ అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉంటుంది అంటూ దర్శకుడు లక్ష్మణ్‌ ఉటేకర్‌ అంటున్నారు.

Tags:    

Similar News