టాలీవుడ్ నెంబర్ 1 హీరోయిన్ ఎవరు..?
యాక్టింగ్ లో గ్లామర్ మాత్రమే కాదు గ్రామర్ ని కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ చేస్తుంది రష్మిక అందుకే ఆమె తన ఫాం కొనసాగిస్తుంది.
ప్రస్తుతం టాలీవుడ్ లీడింగ్ లేడీ ఎవరు.. స్టార్ సినిమా అంటే మొదటి ఆప్షన్ గా ఆలోచన వచ్చే ముద్దుగుమ్మ ఎవరు అనే దానికి ఆన్సర్ దొరికేసింది. లాస్ట్ ఇయర్ యానిమల్ తో పాన్ ఇండియా హిట్ కొట్టడమే కాదు ఈ ఇయర్ పుష్ప 2 తో బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక మందన్నకే మళ్లీ టాప్ చెయిర్ ఇచ్చేశారని చెప్పొచ్చు. యాక్టింగ్ లో గ్లామర్ మాత్రమే కాదు గ్రామర్ ని కూడా పర్ఫెక్ట్ మ్యాచ్ చేస్తుంది రష్మిక అందుకే ఆమె తన ఫాం కొనసాగిస్తుంది.
రష్మిక పుష్ప 2 హిట్ తో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. అమ్మడు చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తున్నాయి కాబట్టి అమ్మడికి వరుస ఛాన్సులు వచ్చేస్తున్నాయి. అదిరిపోయే అవకాశాలతో రష్మిక తన టాలెంట్ చూపించేస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో రష్మిక తర్వాతే ఎవరైనా అనిపించేలా అమ్మడి ఫాలోయింగ్ ఇంకా క్రేజ్ ఉంది.
ప్రస్తుతం తెలుగులో మిగతా హీరోయిన్స్ అందరికన్నా రష్మికనే రేసులో ముందు ఉంది. ఆమె ఏం చేసినా సరే అలా కలిసి వచ్చేస్తుంది. ఆన్ అండ్ ఆఫ్ స్క్రీన్ లో రష్మిక క్రేజ్ చూస్తే మిగతా హీరోయిన్స్ కి కూడా నిద్ర పట్టని విధంగా ఉంది. మొన్నటిదాకా సౌత్ లో తన సత్తా చూపించిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్ లో రెచ్చిపోతుంది. యానిమల్ తర్వాత అక్కడ ఛావా, సికందర్ లాంటి క్రేజీ ప్రాజెక్ట్స్ లో భాగం అవుతుంది.
రష్మిక ఫాం చూస్తుంటే ఇప్పుడప్పుడే అమ్మడు తన ఫాం కొల్పోయే ఛాన్స్ లేదనిపిస్తుంది. రష్మిక సినిమాలో ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అనే టాక్ వచ్చేసింది కాబట్టి కొన్నాళ్లు ఆమెను ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పొచ్చు. సౌత్ తో పోల్చితే నార్త్ లో అదే బాలీవుడ్ లో పోటీ ఎక్కువగా ఉన్నా కూడా రష్మిక ఎంచుకుంటున్న కథలు.. చేస్తున్న కాంబినేషన్స్ వల్ల ఆమె కు లక్ కలిసి వస్తుంది. యానిమల్ సినిమాతో రష్మిక బీ టౌన్ ఆడియన్స్ కి హా**ట్ ఫేవరెట్ గా మారింది. వెంటనే పుష్ప 2 కూడా బ్లాక్ బస్టర్ అవ్వడంతో రష్మిక రేంజ్ మరింత పెరిగింది. ఇప్పుడు రష్మిక వరుస ప్రాజెక్ట్ లతో బిజీ బిజీగా ఉంటుంది. ఆమె చేయడం కుదరదని చెప్పినా సరే ఆమె టైం ఇచ్చే వరకు వెయిట్ చేసి మరీ సినిమాలు చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.