కవర్ షూట్: రష్మిక మందన్న రెబల్ స్టైల్
మరోవైపు రష్మిక వరుస ఫోటోషూట్లు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం 'పుష్ప 2' గ్రాండ్ సక్సెస్ ని ఆస్వాధిస్తోంది రష్మిక మందన్న. శ్రీవల్లిగా తన అద్భుత నటనకు ప్రశంసలు అందుకున్న ఈ బ్యూటీ తదుపరి 'సికందర్' చిత్రంపైనా దృష్టి సారించింది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ సరసన రష్మిక నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏ.ఆర్.మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. మరోవైపు రష్మిక వరుస ఫోటోషూట్లు అంతర్జాలంలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా 'కాస్మోపాలిటన్' మ్యాగజైన్ కవర్ పేజీ కోసం రష్మిక ఫోటోషూట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాస్మో ఇండియా నవంబర్-డిసెంబర్ సంచిక కోసం ఫోటోషూట్ ఇది. ఇప్పటికే కొన్ని స్టిల్స్ అంతర్జాలంలోకి రిలీజయ్యాయి. తాజాగా మరో స్పెషల్ ఫోటోషూట్ ని కాస్మోఇండియా ఇన్ స్టాలో షేర్ చేయగా వైరల్ గా మారింది. ఈ ఫోటోషూట్‌లో రష్మిక యూనిక్ స్టైల్ లో కనిపించింది. కొంత బోల్డ్ గా కనిపించినా యూనిక్ ఫోటోగ్రఫీతో కాస్మో ఇండియా షూట్ ఆకర్షిస్తోంది. రష్మిక మందన్న రెబల్ స్టైల్ ఆకట్టుకుంటోందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు.
తాజాగా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ తో పాటు రష్మిక మందన ఇంటర్వ్యూ నుంచి కొన్ని ఆసక్తికర విషయాలను కాస్మో ఇండియా ఇన్ స్టాలో షేర్ చేసింది. నటిగా ప్రేక్షకుల తీర్పు కోసం ఎదురు చూసేప్పుడు భయం ఉంటుందని, పుష్ప 2 విడుదల సమయంలో అలాంటి భయంతో గడిపానని రష్మిక మందన కాస్మో ఇండియా ఇంటర్వ్యూలో తెలిపారు. ఎల్లప్పుడూ తీర్పు బాధపెడుతుందనే భయం ఉండనే ఉంటుంది. నాకు ఎప్పుడూ ఏదో ఒక భయం ఉన్నట్లు అనిపిస్తుంది. 'పుష్ప' చిత్రీకరణను ముగించిన రోజు నేను మూడు-నాలుగు గంటలు ఏడ్చేంతగా భావోద్వేగాలతో మునిగిపోయాను. చిత్రీకరణ పూర్తయిందనే ఉద్వేగం.. ఇలాంటి ప్రక్రియ ముగియాలని నేను కోరుకోలేదు.. ఆరోజు చాలా ఎమోషన్‌కి గురయ్యాను.. అని తెలిపింది. సల్మాన్ తో 'సికందర్' తర్వాత బన్నీతో 'పుష్ప 3'లోను రష్మిక నటించనుంది.