పీలింగ్స్ సాంగ్. చాలా భయపడ్డా: రష్మిక
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నేషనల్ క్రష్ రష్మిక మందన్న రీసెంట్ గా పుష్ప-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి నేషనల్ క్రష్ రష్మిక మందన్న రీసెంట్ గా పుష్ప-2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆ మూవీతో రష్మిక మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. సినిమాలో శ్రీవల్లి 2.0గా సందడి చేశారు. ముఖ్యంగా తన యాక్టింగ్ తో ఆకట్టుకున్నారు.
ప్రతి సీన్ లో కూడా తన టాలెంట్ ఏంటో చూపించారు అమ్మడు. సాంగ్స్ లో కూడా తన గ్రేస్ తో ఇరగదీశారు. అయితే పీలింగ్స్ సాంగ్ లో తన స్టెప్పులతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారారు. సాంగ్ రిలీజ్ అయ్యాక.. ఒక్కొక్కరు ఒక్కోలా స్పందించారు. కొందరు రష్మిక డ్యాన్స్ ను కొనియాడితే.. మరికొందరు విమర్శించారు.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పీలింగ్స్ పాటపై రష్మిక మాట్లాడారు. సినిమా రిలీజ్ కు కొద్ది రోజుల ముందే సాంగ్ షూట్ చేశామని తెలిపారు. మొత్తం ఐదు రోజుల్లో పాటను పూర్తి చేశామని చెప్పారు. అల్లు అర్జున్ గారితో కలిసి డ్యాన్స్ చేస్తున్నందుకు మురిసిపోయానని పేర్కొన్నారు. కానీ మొదట్లో కాస్త భయంగా, అసౌకర్యంగా అనిపించిందని వెల్లడించారు.
నార్మల్ గా తనను ఎవరైనా ఎత్తుకుంటే భయమేస్తుందని, సాంగ్ లో అల్లు అర్జున్ సర్ ఎత్తుకుని స్టెప్పేస్తారని తెలిపారు. అప్పుడు చాలా భయపడ్డానని చెప్పిన రష్మిక.. ఆ తర్వాత నార్మల్ గా అనిపించిందని పేర్కొన్నారు. షూటింగ్ అంతా ఫన్ తో జరిగిపోయిందని వెల్లడించారు. ఎలాంటి ఇబ్బందిగా అనిపించలేదని అన్నారు.
అయితే సాంగ్ అందరికీ నచ్చకపోవచ్చని, అది ఎవరి ఇష్టం వాళ్లదని నేషనల్ క్రష్ అభిప్రాయపడ్డారు. తాను సినీ ప్రియులను ఎంటర్టైన్ చేయడానికే ఉన్నానని తెలిపారు రష్మిక. ఆ విషయంలో ఎక్కువ ఆలోచించినా తన కొమ్మును తానే నరుకున్నట్లు అవుతుందని అన్నారు. అలా జరగడం ఇష్టం లేదని చెప్పారు.
కొద్ది రోజుల క్రితం.. కెరీర్ లోనే ఇప్పటివరకు పీలింగ్స్.. అత్యంత కష్టమైన సాంగ్ అని ఆమె తెలిపారు. చాలా కష్టమైన పాట కానీ ఎంజాయ్ చేశానని ట్వీట్ చేశారు. దీంతో ఆమె ట్వీట్ కు బన్నీ రిప్లై ఇచ్చారు. యు రాక్డ్ అని ప్రశంసించారు. అయితే పీలింగ్స్ సాంగ్.. యూట్యూబ్ లో భారీ వ్యూస్ సంపాదించుకున్న విషయం తెలిసిందే. థియేటర్లలో కూడా ఈలలు వేయిస్తోంది.