మేల్ డామినేషన్ గురించి నేషనల్ క్రష్ ఏమందంటే?
సినిమా ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు స్పందించారు.
సినిమా ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ పై ఇప్పటికే చాలా మంది హీరోయిన్లు స్పందించారు. ముఖ్యంగా బాలీవుడ్ భామలు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఎన్నోసార్లు వెల్లడించారు. హీరోలతో సమానంగా హీరోయిన్లను ఎందుకు చూడరని, వారితో సమానంగా పారితోషికాలు ఎందుకివ్వరంటూ మీడియా ముందుకొచ్చిన సందర్భాలు కోకొల్లలు. హీరోలకు ఉన్నన్ని సౌకర్యాలు హీరోయిన్లకు, కింద స్థాయి నటీమణులకు కల్పించడం లేదని వివిధ సందర్భాల్లో బయటకొచ్చాయి.
ఈ విషయంలో సౌత్ ఇండస్ట్రీపై పెద్దగా ఆరోణలు లేవు గానీ..బాలీవుడ్ మీద మాత్రం తరుచూ తెరపైకి వస్తూనే ఉంటాయి. కొంత కాలంగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా బాలీవుడ్ పై ఫోకస్ చేసి ముందుకెళ్తున్న సంగతి తెలి సిందే. హైదరాబాద్ కంటే ముంబైలోనే ఎక్కువగా ఉంటుంది. అక్కడ కల్చర్ కు తగ్గట్టు మౌల్డ్ అయి వాతావరణం బాగా అలవాటు చేసుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పురుషాధిక్యం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ అన్న మాటను ఆమె సమర్దించారు. అయితే మునుపటి కంటే ఇప్పుడు పరిస్థితులు కాస్త మెరుగు పడ్డాయంది. ట్యాలెంట్ ఉన్న వారికి పరిశ్రమ మంచి అవకాశాలు కల్పిస్తుందంది. తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నా? హిందీ సహా ఇతర భాషలపై దృష్టి పెట్టడం వల్ల పూర్తి స్థాయిలో తెలుగు సినిమాలు చేయలే కపోతున్నానని నిరాశని వ్యక్తం చేసింది. అందువల్లే టాలీవుడ్ ఆడియన్స్ తన విషయంలో కాస్త అసంతృప్తిగాను ఉన్నట్లు అభిప్రాయపడింది.
అయితే ఇలా తన గురించి ఆలోచిస్తున్నారు అంటే అభిమానులు తనని అంతగా ప్రేమిస్తున్నారంది. అలాగే తనని ఇతరులతో పోల్చుకోవడానికి ఏమాత్రం ఇష్టపడనని, దీనికి ఇండికేషన్ గానే తన చేతిపై ఇరీ ప్లేసబుల్ అని చేతిపై పచ్చబోటు కూడా వేసుకున్నట్లు తెలిపింది.