రెడ్ బికినీలో రష్మిక డీప్‌ఫేక్
ఇటీవలి కాలంలో పెరిగిన సాంకేతికత సెలబ్రిటీల కంటికి కునుకుపట్టనివ్వడం లేదు.
ఇటీవలి కాలంలో పెరిగిన సాంకేతికత సెలబ్రిటీల కంటికి కునుకుపట్టనివ్వడం లేదు. డీప్ ఫేక్‌లు నటీమణులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రకరకాల అసభ్యకర ఫోటోలు, వీడియోలు అంతర్జాలంలో తమకు తెలియకుండానే వైరల్ అయిపోతున్నాయి. కొన్ని అశ్లీల వెబ్ సైట్లలోను స్టార్లను పోలిన ఫోటోలు వీడియోలు ప్రత్యక్షమవ్వడం కలకలం రేపుతోంది.
అదంతా అటుంచితే ఇంతకుముందు అగ్ర కథానాయిక రష్మిక మందన్న డీప్ ఫేక్ ఫోటో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దానిపై సెలబ్రిటీ ప్రపంచం సహా నెటిజనుల నుంచి రష్మికకు మద్ధతు లభించింది. అలాంటి తప్పుడు విధానాలకు సాంకేతికత ఉపయోగించడం దురదృష్టమని అన్నారు. దీనిపై సైబర్ క్రైమ్ అధికారులు విచారణ సాగించి నిందితలను గుర్తించిన సంగతి తెలిసిందే.
అయితే డీప్ ఫేక్ వ్యవహారం అక్కడితో ఆగిపోలేదు. ఆ తర్వాత కూడా పలువురు నటీమణులు దీనికి బాధితులుగా మారారు. అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు నిరంతరం ఆన్ లైన్ లో ప్రత్యక్షమవ్వడం సమస్యాత్మకంగా మారింది.
ఇదిలా ఉండగానే ఇప్పుడు మరోసారి రష్మిక డీప్ ఫేక్ భారిన పడింది. అందాల రష్మిక మందన్న రెడ్ బికినీలో ఒక జలపాతం వద్ద పోజులిచ్చినట్లు ఒక వీడియో ఫేస్‌బుక్, ఇన్ స్టా, యూట్యూబ్ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ అవుతోంది. ఈ స్టోరీకి 45,000 కంటే ఎక్కువ లైక్ లు.. దాదాపు 300 షేర్లు కూడా ఉన్నాయి.
అయితే ఆ వీడియో డీప్ ఫేక్. కొలంబియాలోని శాంటాండర్‌లో మోడల్ కం కంటెంట్ క్రియేటర్‌గా తనను తాను అభివర్ణించుకునే డానియెలా విల్లారియల్ ఇన్ స్టా ఖాతా నుండి క్లిప్ ని వీరు సంగ్రహించి డీప్ ఫేక్ ని సృష్టించారని తెలుస్తోంది. ఈ వీడియోలో లెక్క లేనన్ని లోపాలు తెలిసిపోతుండడంతో ఇది ఫేక్ అని తేలింది. విల్లారియల్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియో (ఇక్కడ ఆర్కైవ్ చేయబడింది) ప్రొఫైల్‌లో 19 ఏప్రిల్ 2024న అప్‌లోడ్ చేసారని తెలుస్తోంది. ఏప్రిల్‌లో సదరు మోడల్ ప్రొఫైల్‌లో అప్‌లోడ్ చేసిన అదే బికినీ ఫోటోలు అక్కడ ఉన్నాయి.
నవంబర్ 2023లో రష్మిక మందన్న బ్లాక్ బాడీసూట్‌లో ఉన్న మరో డీప్‌ఫేక్ వీడియో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఇది ఫిర్యాదు దాఖలైన 24 గంటల్లో ప్లాట్‌ఫారమ్‌ల నుండి అలాంటి వీడియోలను తొలగించాలని కోరుతూ సోషల్ మీడియా మధ్యవర్తులకు ఆదేశాన్ని జారీ చేయడానికి భారత ప్రభుత్వాన్ని ప్రేరేపించింది. ఈ ఘటన అనంతరం ఇలాంటి అనేక ఇతర వీడియోలను తొలగించారు.. కృత్రిమ మేధస్సును ఉపయోగించి రూపొందించబడిన డీప్‌ఫేక్ ఫోటోలు, వీడియోలను గుర్తించడానికి సాంకేతికత అందుబాటులో ఉంది. లాజికల్లీ ఫ్యాక్ట్స్ డాట్ కామ్ లో అలాగే ABP లైవ్ (మాకు అందిన సోర్స్)లో ప్రచురించిన కథనాల ఆధారంగా ఈ కథనం ప్రచురితమైంది. సభ్యత కోసం రష్మిక డీప్ ఫేక్ బికినీ ఫోటోను ఇక్కడ ప్రచురించడం లేదు.