రష్మిక ఫేక్ వీడియో.. ఒరిజినల్ గర్ల్ ఏమంది అంటే?
సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో కొన్ని వీడియోలను చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది
సోషల్ మీడియాలో ఇటీవల కాలంలో కొన్ని వీడియోలను చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. మొన్నటి వరకు ఇది ఒక పరిధిలో ఉండగా ఇప్పుడు హద్దులు దాటే విధంగా దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. గతంలో ఫోటోల ద్వారా అసభ్యకరమైన ఇమేజ్ లను క్రియేట్ చేసి వైరల్ చేసిన వారు చాలానే ఉన్నారు. ఇక ఆ ఫోటోల వలన పలువురు అమాయకులు కూడా ప్రాణాలు తీసుకున్నారు.
ఇక సెలబ్రిటీలకు ఇది నిత్యం ఎదురయ్యే యుద్ధంగా మారిపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాను ఎన్ని కేసులు నమోదు చేసిన కూడా ఫేక్ వీడియోలు కుప్పలు కుప్పలుగా పుట్టుకొస్తూనే ఉన్నాయి. రీసెంట్గా రష్మిక మందన ఫేక్ వీడియో ఎంతగా ఆశ్చర్యపరిచిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ విషయంలో చాలామంది సెలబ్రిటీలు ఆమెకు మద్దతుగా నిలవడం కూడా ప్రశంసించాల్సిన విషయం.
బాడీ మరొకరిది అందులో ఉండే మొహం మాత్రం వేరొకరిది. ఈ విధంగా హీరోయిన్స్ ఇబ్బంది కలిగించే వీడియోలను క్రియేట్ చేస్తూ పలువురు డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. అయితే రష్మిక మందన్న ఫేస్ తో ఉన్నది ఫేక్ వీడియో అని చాలా తొందరగానే క్లారిటీ వచ్చేసింది. అయితే రష్మిక కాకపోతే ఆ వీడియోలో ఉన్న అసలు అమ్మాయి ఎవరు అనే విషయం గురించి సోషల్ మీడియాలో ఒక టాపిక్ వైరల్ అయింది.
అయితే మొత్తానికి అందులో ఉన్న అమ్మాయి సోషల్ మీడియాలో వివరణ ఇచ్చింది. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జారా పటేల్. వీడియో చూసిన అనంతరం ఆమె ఈ విధంగా వివరణ ఇచ్చారు. నా శరీరానికి హీరోయిన్ రష్మిక ఫేస్ పెట్టి ఎవరో ఫేక్ వీడియోను వైరల్ చేశారు. అది చూసిన నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను.
మార్ఫింగ్ లో అయితే నా ప్రమేయం ఎంత మాత్రం లేదు. ఇది చేసిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ విధంగా టెక్నాలజీని వాడుకోవడం చూస్తుంటే భవిష్యత్తులో మహిళలు ఆడపిల్లలకు భద్రత విషయంలో చాలా కంగారు కలిగిస్తోంది అని అన్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు పోస్ట్ చేశాను చేసే ముందు ఒకటికి పది సార్లు ఆలోచించుకోవాలి అని సూచించారు.