పిక్ టాక్‌ : నేషనల్‌ క్రష్‌ చిల్‌ మూమెంట్స్‌

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తక్కువ సమయంలో పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది

Update: 2024-06-20 06:18 GMT

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న తక్కువ సమయంలో పాన్ ఇండియా స్థాయిలో వరుస సినిమాలు చేసే స్థాయికి ఎదిగింది. నేషనల్‌ క్రష్ అంటూ అభిమానులు ముద్దుగా పిలుచుకునే రష్మిక మందన్న ప్రస్తుతం పుష్ప 2 తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్‌ లలో నటిస్తున్న విషయం తెల్సిందే.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా వ్యక్తిగత జీవితం కు కచ్చితంగా కావాల్సినంత సమయం కేటాయిస్తూ ఉండే రష్మిక మందన్న సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌ గా ఉంటుంది. రెగ్యులర్ గా సోషల్‌ మీడియా ద్వారా అందాల ఆరబోత ఫోటోలతో పాటు, తన రొటీన్ లైఫ్‌ ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది.

తాజాగా హాలీడేస్‌ కి సంబంధించిన ఫోటోలను షేర్‌ చేసింది. చిల్లింగ్ మూమెంట్స్‌, హ్యాపీ మూమెంట్స్ అంటూ ఈ అమ్మడు షేర్‌ చేసిన ఈ ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నాయి. సాధారణంగా హీరోయిన్స్ స్కిన్‌ షో చేస్తేనే అందరి దృష్టి ఆకర్షించడం జరుగుతుంది. కానీ రష్మిక ఈ ఫోటోలతో కూడా తనవైపు దృష్టి మరల్చుకుంది.

ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్ రష్మిక సొంతం అంటూ ఫ్యాన్స్ కామెంట్స్‌ చేస్తూ ఉంటారు. అలాంటి రష్మిక ఇలాంటి చిల్లింగ్‌ మూమెంట్స్ లో కూడా చాలా అందంగా క్యూట్‌ గా కనిపిస్తుందని నెటిజన్స్‌ మరియు ఫ్యాన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలీవుడ్‌ లో యానిమల్‌ సినిమాలో నటించడం ద్వారా ఒక్కసారిగా అక్కడ బిజీ అయ్యింది. అంతకు ముందు చేసిన సినిమాలు నిరాశ పరిచినా కూడా యానిమల్‌ తర్వాత ఆమె వద్దకు అర డజను ఆఫర్లు వచ్చాయట. కానీ ఆమె మాత్రం ఆచితూచి వ్యవహరిస్తూ అడుగులు వేస్తూ సినిమాలకు కమిట్‌ అవుతోంది.

Tags:    

Similar News