రష్మిక నిర్ణయం సరైనిదేనా?
నేషనల్ క్రష్ రష్మిక రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియాలో మారు మ్రోగిపోతుంది
నేషనల్ క్రష్ రష్మిక రేంజ్ ఇప్పుడు పాన్ ఇండియాలో మారు మ్రోగిపోతుంది. `పుష్ప`..`యానిమల్` విజయాలతో తనకంటూ బ్రాండ్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది. ఇదంతా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలతోనే సాధ్యమైంది అన్నది అంతే వాస్తవం. తొలి సినిమా `ఛలో` నుంచి `యానిమల్` వరకూ కథల విషయంలో ఎంతో సెలక్టివ్ గా వెళ్లింది. హీరోయిన్ గా తన పాత్రకు ఎలాంటి ప్రయార్టీ ఉంది? ఒకే చెబితే సక్సెస్ అవుతుందా లేదా? గుర్తింపు దక్కుతుందో లేదా? ఇలా ఎన్నో కొలమానాలతో ఆ సినిమాలు చేసింది.
చివరికి `సీతారామం`లో ముస్లీం యువత పాత్ర లో గెస్ట్ అప్పీరియన్స్ ఇచ్చింది. తెరపై కనిపించింది కాసేపే అయినా కథను మలుపు తిప్పే పాత్ర కావడంతో ప్రత్యేకమైన గుర్తింపు దక్కింది. `డియర్ కామ్రేడ్` సినిమా ఆశించిన ఫలితాన్నివ్వనప్పటికీ నటిగా మంచి పాత్ర పోషించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలా ఇంతవరకూ పాత్రల ఎంపిక పరంగా రష్మిక ఎక్కడా ఫెయిల్ అవ్వలేదు. హీరోల పాత్రలకు ధీటుగానే ఆమె పాత్ర ఉండేలా చూసుకుంది. ఆవిషయంలో మేకర్స్ నుంచి మంచి సహకారం అందింది.
ఇటీవలే సల్మాన్ ఖాన్ హీరోగా మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `సికందర్` లోనూ ఎంపికైంది. అయితే ఈ సినిమా విషయంలో రష్మిక నిర్ణయం సరైనిదేనా? అన్న సందేహాలు నెట్టింట వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మురగదాస్ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు పెద్దగా వెయిట్ ఉండదు. ఆయన తొలి సినిమా నుంచి హీరోయిన్ అంటే కమర్శియల్ కోణంలో కనిపిస్తుంది తప్ప! నటనకు ఆస్కారం ఉండదు. హీరో వన్ మ్యాన్ షోతోనే ఆయన కథలుంటాయి.
అందులోనూ సల్మాన్ ఖాన్ లాంటి హీరోతో హీరోయిన్ అంటే? ఆయన ఇమేజ్ ముందు రష్మిక తేలిపోతుందా? అన్న సందేహాలు తెరపైకి వస్తున్నాయి. `సికందర్` భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మురగదాస్ మలుస్తున్నారు. ఈ నేపథ్యంలో రష్మిక `సికందర్` కి కమిట్ అవ్వడం సరైన నిర్ణయమేనా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.