కమ్ముల ఆఫర్.. తక్కువకే ఒప్పేసుకున్న రష్మిక
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తోంది. తెలుగులో పుష్ప2, హిందీలో యామినల్ మూవీస్ ఆమె ఖాతాలో ఉన్నాయి. దాంతో పాటుగా రెయిన్ బో అనే ఫీమేల్ సెంట్రిక్ మూవీ కూడా ఈ బ్యూటీ చేస్తోంది. పుష్పతో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన రష్మిక రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేసి 4 కోట్లు డిమాండ్ చేస్తోంది.
అయితే ఈ బ్యూటీ బడ్జెట్ పెంచిన తర్వాత అవకాశాలు బాగా తగ్గాయి. రష్మిక ఆఫర్స్ ని శ్రీలీల ఎత్తుకుపోతోంది. వెంకి కుడుముల దర్శకత్వంలో నితిన్ తో కమిట్ అయిన సినిమా నుంచి కూడా రెమ్యునరేషన్ కారణంగానే తప్పించినట్లు టాక్. ఆ స్థానంలోకి శ్రీలీల వచ్చి చేరింది. రెండు పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ అయితే కానీ మళ్ళీ రష్మికకి బిగ్ ఆఫర్స్ రావడం కష్టం అందరూ భావించారు.
అయితే అనూహ్యంగా ఆమె ధనుష్ 51 మూవీలో హీరోయిన్ గా ఎంపికైంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో పీరియాడికల్ జోనర్ లో పాన్ ఇండియా సినిమాగానే ఇది తెరకెక్కనుంది. ఈ మూవీలో రష్మినిని హీరోయిన్ గా దాదాపు ఖరారు చేశారు. కెప్టెన్ మిల్లర్ మూవీ షూటింగ్ కంప్లీట్ కాగానే D51 షూటింగ్ స్టార్ట్ కానుంది. అయితే ఈ మూవీ ఛాన్స్ రష్మికకి రావడం వెనుక మరొక కారణం ఉందంట.
సినిమా కోసం ఆమె రెమ్యునరేషన్ 3.50 కోట్ల నుంచి 2 కోట్లకి తగ్గించిందంట. నిర్మాత ఏషియన్ సునీల్ కేవలం 2 కోట్ల వరకు ఇవ్వడానికి మొగ్గు చూపించారంట. అయితే పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో పాటు పుష్ప2, యానిమల్ తప్ప ప్రస్తుతం చేతిలో చెప్పుకోదగ్గ పెద్ద సినిమాలు లేకపోవడంతో రష్మిక ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి కాంపిటేషన్ ఎక్కువ కావడంతో ఈ బ్యూటీ తగ్గక తప్పలేదని మాట వినిపిస్తోంది.
ఒక వేళ ఇదే రెమ్యునరేషన్ ని కొనసాగిస్తే రష్మిక చేతికి మరికొన్ని ప్రాజెక్ట్స్ చిక్కే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇప్పుడు టాలీవుడ్ హీరోలు అందరూ యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథలు ఎంచుకుంటూ హీరోయిన్ కి కూడా ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటున్నారు. అలాంటి మూవీస్ ఛాన్స్ వస్తే పాన్ ఇండియా హీరోయిన్ గా తన ఇమేజ్ ని కంటిన్యూ చేయవచ్చని రష్మిక భావిస్తోంది.