చీర‌లో వ‌ర్క‌వుట్లు ఎలా సాధ్యం ర‌ష్మికా?

అవును.. ఈ బ్యూటీ న‌ల్ల కోకలో సౌక‌ర్యం గురించి చాలా ఆశ్చ‌ర్య‌పోయే సంగ‌తి చెప్పింది. న‌ల్ల‌ చీర ధ‌రించి సౌక‌ర్యంగా వ‌ర్క‌వుట్లు చేయ‌గ‌ల‌న‌ని అంది.

Update: 2023-12-21 06:27 GMT

అవును.. ఈ బ్యూటీ న‌ల్ల కోకలో సౌక‌ర్యం గురించి చాలా ఆశ్చ‌ర్య‌పోయే సంగ‌తి చెప్పింది. న‌ల్ల‌ చీర ధ‌రించి సౌక‌ర్యంగా వ‌ర్క‌వుట్లు చేయ‌గ‌ల‌న‌ని అంది. అంత‌గా త‌న‌కు ఈ చీర న‌చ్చేసింది మ‌రి. ఇంత‌కీ ఎవ‌రీ భామ‌? అంటే ప్ర‌త్యేకించి ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. యానిమ‌ల్ స‌క్సెస్ తో జోష్ లో ఉన్న ర‌ష్మిక మంద‌న్న ఇప్పుడు న‌ల్ల కోక‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఈ చీర డిజైన్ ఎంతో ఆక‌ట్టుకుంది. తాజాగా చీర లో త‌న సొగ‌సును ఫోటోల రూపంలో షేర్ చేసిన ర‌ష్మిక‌.. ఇన్ స్టాలో ఇలా రాసింది. ``నేను ఈ చీర మెటీరియల్‌ని చాలా ఇష్టపడ్డాను. బహుశా నిద్ర, మేల్కొలన‌డం - వ్యాయామం చేయగలనని అనుకుంటున్నాను. నా కార్డియో, ఫిల్మ్ షూట్, ప్రతిదీ చేయగలను`` అని రాసింది.


ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో తెలుగు సినిమా చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటున్న ర‌ష్మిక మంద‌న ఉన్న‌ట్టుండి ఇలా చీర గురించి ముచ్చ‌టిస్తుందేమిటీ? అంటూ అభిమానులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. ఈ చీరలో అంత ప్ర‌త్యేక‌త ఏం ఉందీ అంటూ ఆరాలు తీస్తున్నారు. ఇది సాధారణ అపారదర్శక నలుపు రంగు చీర‌. దానికోసం ఉప‌యోగించిన మెటీరియ‌ల్ సౌక‌ర్యంగా ఉంద‌నేది ర‌ష్మిక ఉద్ధేశం. ఇది న‌లుపుపై నారింజ పువ్వుల డిజైన్ తో ఎంతో స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. స్లీవ్‌లెస్ బ్లాక్ బ్లౌజ్ ని క‌వ‌ర‌ప్ చేస్తూ చీర‌లో ర‌ష్మిక ఎంతో అందంగా క‌నిపిస్తోంది.


సొగ‌సైన‌ చీర‌లో ర‌ష్మిక మేటి న‌టి సుహాసినిని త‌ల‌పిస్తోంద‌ని అభిమానులు భావిస్తున్నారు. సుహాసిని, విజ‌య‌శాంతి, రాధ ఆ రోజుల్లో ఇలాంటి చీర‌లు ధ‌రించి కుర్ర‌కారు గుండెల్ని కొల్ల‌గొట్టార‌ని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు ర‌ష్మిక కూడా క్లాసిక్ నాయిక‌ల జాబితాలో చేరిపోయింది. యానిమ‌ల్ గురించి మ‌ర్చిపోయి ఇలా స్వేచ్ఛ‌గా న‌ల్ల కోక గురించే ముచ్చ‌టిస్తోందంటే దానికి కార‌ణం కూడా స‌హేతుక‌మేన‌ని అర్థ‌మ‌వుతోంది.

Tags:    

Similar News