రష్మిక కూడా 2 లక్షల పుస్తకాలు ట్రై చేస్తుందా?
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా టాలీవుడ్..బాలీవుడ్ అంటూ రెండు భాషల్లోనూ బిజీగా ఉంది.
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా టాలీవుడ్..బాలీవుడ్ అంటూ రెండు భాషల్లోనూ బిజీగా ఉంది. కొంత కాలంగా హైదరాబాద్ టూ ముంబై జర్నీలు తరుచూ చేస్తోంది. దీంతో ఖాళీ సమయం దొరకడం కష్టంగా మారింది. దొరికితే మాత్రం రిలాక్స్ మోడ్ లోకి వెళ్లిపోతుంది. సింగిల్ గానే వెకేషన్లకు చెక్కేస్తోంది. అయితే ఈసారి సమయాన్ని మాత్రం వెకేషన్ కి బధులుగా రీడింగ్ తో ఆస్వాదిస్తున్నట్లు తెలుస్తోంది.
ఒకప్పుడు చదవడం భారంగా ఉన్నా ఇప్పుడు మాత్రం ఇష్టపడి చదువుతున్నట్లు చెప్పుకొచ్చింది. చిన్న నాటి నుంచి పుస్తకాలు చదివే అలవాటు పెద్దగా లేదుట. ఈ మధ్యనే చదివే అలవాటు చేసుకుందిట. ఇప్పటికే చదవడం మొదలు పెట్టి రెండు నెలలు గడుస్తుందిట. ఈ సమయంలో ఐదారు పుస్తకాలు చదివిందిట. పుస్తకాలు చదివితే ఎంత కిక్ ఇస్తుందన్నది ఇప్పుడే అర్దమవుతుందంది.
ఈ 28 ఏళ్ల వయసులో ఆ కిక్ తెలియలేదని అంటోంది. తెలిస్తే బుక్ రీడింగ్‌ను ఎప్పటి నుంచో అలవాటు చేసుకునే దాన్నంటూ రష్మిక చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించి రష్మిక తన ఇన్ స్టా స్టోరీలో వేసిన పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంకా ఫుల్ ఎగ్జైట్ అనిపించే పుస్తకాలుంటే చెప్పండి. ప్రస్తుతం రోమ్ కామ్ పుస్తకాలు చదువుతోందట. ఇంకా చదవాల్సిన పుస్తకాలు చాలానే ఉన్నాయంటోంది.
మొత్తానికి అమ్మడిలో చదివే ఉత్సాహం చూస్తుంటే పవన్ కళ్యాణ్ రెండు లక్షల పుస్తకాలు రికార్డు బ్రేక్ చేసినా చేయోచ్చు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తక్కువ సమయంలోనే రెండు లక్షల పుస్తకాలు చదివి ఎంతో నాలెడ్జ్ సంపాదించినట్లు రివీల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు.