ఫోటో స్టోరి: రెబల్ మందన పొట్టి నిక్కరు
''కొన్నిసార్లు మీరు ఆగి ఆలోచిస్తారు.. పాపం! ఇదంతా ఎలా జరిగింది. ఇదంతా ఎప్పుడు జరిగింది.
యానిమల్ గ్రాండ్ సక్సెస్ తో మరోసారి రష్మిక మందన్న పేరు మార్మోగింది. ముఖ్యంగా ఈ చిత్రంలో రణబీర్ తో పోటీపడుతూ నటించిన ఈ భామకు మంచి పేరు గుర్తింపు దక్కింది. బాలీవుడ్ లో వరుస వైఫల్యాల తర్వాత తనకు యానిమల్ ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. ఇప్పుడు పుష్ప సీక్వెల్లో శ్రీవల్లి పాత్రతో మరోసారి అదే స్థాయి ముద్ర వేయాలని బలంగా కోరుకుంటోంది రష్మిక మందన్న. ఈ ఏడాదితో రష్మిక మందన్న వినోద పరిశ్రమలో 7 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. తన కెరీర్‌లో ఈ ముఖ్యమైన మైలురాయిని చేరుకోవడానికి అవకాశం కల్పించిన వారందరికీ తన కృతజ్ఞతలు తెలిపింది. జీవితంలో సరైన ఎంపికలు తనను ముందుకు నడిపించాయని ఆనందం వ్యక్తం చేసింది
''కొన్నిసార్లు మీరు ఆగి ఆలోచిస్తారు.. పాపం! ఇదంతా ఎలా జరిగింది. ఇదంతా ఎప్పుడు జరిగింది. ఎందుకు జరిగింది అని..! నేను చాలా సంతోషిస్తున్నాను.. ఇదంతా జరిగినందుకు! ప్రోత్సహించిన మీ అందరికీ కృతజ్ఞతలు. శాంతిగా.. సంతోషంగా! ఇది నేను ఎప్పుడూ కలలు కనేది.. నేను కొన్ని గ్రహించలేకపోయాను.. నాకు తెలియని దాని వైపు పరుగెత్తుతూనే ఉంటాను.. కానీ సరైన వ్యక్తులతో ప్రయాణించటం వల్ల మీరు కొన్నిసార్లు పాజ్ చేయవలసి ఉంటుందని తెలుసుకుంటారు. గ్రహించండి - ఇది ఇదే! లిల్ (చిన్నమ్మాయి) అమ్మాయి కలలు కంటూ పెరిగింది'' అని రష్మిక ట్వీట్ చేసింది.
కిరిక్ పార్టీ చిత్రంతో విజయవంతమైన అరంగేట్రం తరువాత రష్మిక `అంజనీ పుత్ర`- `చమక్` వంటి పలు కన్నడ చిత్రాలలో కనిపించింది. 2018లో తన పరిధిని విస్తరించింది. నాగశౌర్య `ఛలో`తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది. గీత గోవిందంలో విజయ్ దేవరకొండతో కలిసి నటించింది. ఈ సినిమా తన కెరీర్ కి బిగ్ బ్రేక్ నిచ్చింది. దేవదాస్, డియర్ కామ్రేడ్, సరిలేరు నీకెవ్వరు వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో అగ్రకథానాయికగా ఎదిగింది. అయితే బాలీవుడ్ ఆరంగేట్ర చిత్రాలు మిషన్ మజ్ను, గుడ్‌బై ఆశించినంత విజయాలు సాధించలేదు. ఇప్పుడు యానిమల్ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడమే గాక, తన నటనా నైపుణ్యాన్ని ప్రదర్శించే అవకాశం అందుకుంది. పుష్ప లో శ్రీవల్లిగా మెప్పించి, ఇప్పుడు పుష్ప2లో ఆ పాత్రకు కొనసాగింపులో అదరగొట్టబోతోంది.