గ్లామర్ ట్రీట్ తో రష్మిక జ్ఞాపకాలు..

గ్లామరస్ బ్యూటీ రష్మిక మందన్న ప్రతి ఏడాది ఏదో ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.

Update: 2024-03-14 05:49 GMT

గ్లామరస్ బ్యూటీ రష్మిక మందన్న ప్రతి ఏడాది ఏదో ఒక సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. లక్కుతోపాటు ఆమె నటన అందం అన్నీ కూడా బాగా కలిసి వస్తున్నాయి. కేవలం పెద్ద సినిమాలు మాత్రమే కాకుండా మీడియం బడ్జెట్ సినిమాలు కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. మంచి కంటెంట్ ఉన్న క్యారెక్టర్స్ ఏమాత్రం మిస్ చేసుకోవడం లేదు.


దాదాపు అన్ని వైపులా ఆమె తన క్రేజ్ పెంచుకునే విధంగా అడుగులు వేస్తూ ఉంది. బాలీవుడ్ లో కూడా చాలా తొందరగానే బిగ్ సక్సెస్ చూసిన అమ్మడు ఇప్పుడు అంతకుమించి అనేలా సక్సెస్ అందుకోవడానికి రెడీ అవుతోంది. ఇక అప్పుడప్పుడు పలు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో కూడా పాల్గొంటుంది. రీసెంట్ గా ఈ బ్యూటీ టోక్యో కి వెళ్లిన విషయం తెలిసిందే.


అక్కడ ప్రధాన నగరాలను చుట్టేసిన అమ్మడు తన అందమైన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ ఫోటోలో రష్మిక చాలా గ్లామర్ తోనే కాకుండా సింపుల్ డ్రెస్ లలో క్యూట్ గా కూడా దర్శనం ఇచ్చింది. ముఖ్యంగా ఒక స్టైలిష్ డ్రెస్ లో మాత్రం ఆమె ఇచ్చిన స్మైల్ చాలా బాగుంది అంటూ నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.


రష్మిక మరికొంత కాలం వరకు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదుగుతుంది అనే విధంగా కామెంట్స్ వస్తున్నాయి. ఇక ఈ బ్యూటీ పుష్ప సెకండ్ పార్ట్ లో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా పైన అంచనాలు హై రేంజ్ లో ఉన్నాయి. అలాగే బాలీవుడ్ లో కూడా ఒక రెండు సినిమాలు చేస్తోంది. 2016లో కిరాక్ పార్టీ సినిమాతో మొదలైన ఆమె ప్రయాణం ప్రతి ఏడాది అంతకంతకు పెరుగుతూనే ఉంది.


ఇక గత ఏడాది వారిసు మిషన్ మజ్ను యానిమల్ సినిమాలలో నటించిన విషయం తెలిసిందే. అందులో యానిమల్ సినిమా బిగ్గెస్ట్ బాక్సాఫీస్ బిగ్గెస్ట్ హిట్ గా నిలువగా వారిసు కమర్షియల్ గా మంచి గుర్తింపును అందించింది. ఇక నెక్స్ట్ పుష్ప 2 తో పాటు రెయిన్ బో అనే ఒక లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ లో కూడా నటిస్తోంది. ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా కూడా సెట్స్ పై ఉంది. ఇక సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎప్పటికప్పుడు అమ్మడు తన క్రేజ్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. రీసెంట్ గా ఆమె ఫాలోవర్ల సంఖ్య కూడా ఒక్కసారిగా పెరిగిపోయింది మరి నెక్స్ట్ సినిమాలతో ఈ బ్యూటీ ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News