అల్ట్రా స్టైలిష్ లుక్కుతో రష్మిక హొయలు

కానీ, ఈ ఫోటో షూట్ లో మాత్రం సూటు, బూటు ధరించింది. తన లుక్స్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఆమెకు బాగా నప్పాయి. సూపర్ హాట్ గా కనిపిస్తోంది.

Update: 2023-09-16 06:11 GMT

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ లో రష్మిక మందనా ఒకరు. ఆమె టాలీవుడ్ లో వరస అవకాశాలు అందుకొని, స్టార్ హీరోలతో నటిస్తోంది. ఓ వైపు టాలీవుడ్ లో సినిమాలు చేస్తూనే, మరోవైపు బాలీవుడ్ లో నూ సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం రష్మిక, అల్లు అర్జున్ సరసన పుష్ప2 మూవీలో నటిస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరోవైపు బాలీవుడ్ లో రష్మిక అమితాబచ్చన్ తో గుడ్ బై , సిద్ధార్థ్ మల్హోత్రా తో మిషన్ మజ్నూ వంటి సినిమాల్లో నటించేసింది. అయితే, ఆ సినిమాలు అనుకున్నంత సక్సెస్ కాలేకపోవచ్చు. కానీ, మళ్లీ ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్లు మాత్రం క్యూ కడుతున్నాయి. ఆమె నటించిన యానిమల్ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయింది. చేతిలో సినిమాలతో బిజీగా ఉన్నా రష్మిక, సోషల్ మీడియాలో మాత్రం చురుకుగా ఉంటుంది.

ఎప్పటికప్పుడు డిఫరెంట్ ఫోటో షూట్ లతో అలరిస్తూ ఉంటుంది. తాజాగా ఓ మ్యాగజైన్ కోసం సూపర్ స్టైలిష్ లుక్ లో మెరిసింది. ఇప్పటి వరకు రష్మికను హోమ్లీగా, పద్దతిగా చీరల్లో చూసి ఉంటారు, లేదంటే మోడ్రన్ దుస్తుల్లో చూసి ఉంటారు. కానీ, ఈ ఫోటో షూట్ లో మాత్రం సూటు, బూటు ధరించింది. తన లుక్స్, ఆ డ్రెస్సింగ్ స్టైల్ ఆమెకు బాగా నప్పాయి. సూపర్ హాట్ గా కనిపిస్తోంది.

ఆడి క్యూ8 స్పోర్ట్స్ కారు పై స్టైల్ గా కూర్చొని ఫోజులు ఇచ్చింది. రష్మికలో ఈ యాంగిల్ కూడా ఉందా? అందుకే నేషనల్ క్రష్ అన్నారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

ఇదిలా ఉండగా, రష్మిక రౌడీ హీరో విజయ్ దేవర కొండతో ప్రేమలో ఉందంటూ చాలా కాలం గా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల మరో వార్త కూడా వీరి గురించి బయటకు వచ్చింది. దాని ప్రకారం, రష్మిక విజయ్ తో కలిసి లివ్ ఇన్ లో ఉంది అని, దానికి నెటిజన్లు అయితే ఏకంగా ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. అయితే, ఆ విషయంపై ఇఫ్పటి వరకు ఈ జోడి మాత్రం స్పందించలేదు. ఇక, రష్మకి కెరీర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఆమె బాలీవుడ్ లో పాతుకుపోవాలని చూస్తోంది. పుష్ప2 తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగే అవకాశం పుష్కలంగా ఉంది.

Tags:    

Similar News