బిగ్ బాస్ : టీం అందరినీ 'బఫూన్స్' అనేసింది
రతిక చేసిన హడావిడి మరియు కామెంట్స్ కారణంగా గెలుపొందిన రణధీర టీం కి కాకుండా మహాబలి టీం కి అవకాశం లభించింది.
బిగ్ బాస్ మొదటి వారంలో పెద్దగా గొడవలు లేకుండా సాగింది. కానీ రెండవ వారంలో అసలైన ఆట మొదలు అన్నట్లుగా సాగుతోంది. ఇప్పటికే ఇంటి సభ్యులను రణధీర మరియు మహాబలి టీం లుగా విడదీసి టాస్క్ లను ఇవ్వడం జరుగుతుంది. టాస్క్ ల్లో భాగంగా రెండు టీమ్స్ రెండు రోజుల పాటు హోరా హోరీగా తలపడ్డాయి.
పవర్ అస్త్ర కోసం పోటీ పడ్డ టీమ్స్ లో రణధీర టీం విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ టీమ్ లో ఒకరు మళ్లీ పవర్ అస్త్ర కోసం పోటీ పడాల్సి ఉంటుందని బిగ్ బాస్ ప్రకటించాడు. రణధీర టీం మెంబర్స్ లో ఒకరు అయిన రతిక చేసిన హడావిడి మరియు కామెంట్స్ కారణంగా గెలుపొందిన రణధీర టీం కి కాకుండా మహాబలి టీం కి అవకాశం లభించింది.
తన టీం లో అందరూ బఫూన్స్ అంటూ రతిక చేసిన వ్యాఖ్యలు అందరికి షాక్ ఇచ్చాయి. రెండు రోజుల పాటు టాస్క్ ల్లో టీం తో కలిసి పాల్గొన్న రతిక ఇప్పుడు వారిని బఫూన్స్ అంటూ మాట్లాడటం ఏంటి అంటూ సంచాలక్ అయిన ఆట సందీప్ తో పాటు ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేశారు.
రతిక మరియు దామిణి మధ్య జరిగిన గొడవ ఒక్కసారిగా హౌస్ ని హీట్ ఎక్కించింది. రతిక ప్రవర్తనకి ఫీల్ అయిన దామిని కన్నీళ్లు పెట్టుకోవడంతో పాటు ఆమె చిన్నపిల్లలా వ్యవహరిస్తుందని ఇతర కంటెస్టెంట్స్ ముందు వాపోయింది. ఇక సందీప్ పవర్ అస్త్ర ను దొంగించడంతో కూడా తాజా ఎపిసోడ్ రసవత్తరంగా సాగింది.
ఇంటి సభ్యుల్లో చాలా మంది కూడా రతిక వ్యవహారంను తప్పుబడుతున్నారు. షకీలా స్పందిస్తూ రతిక ఎక్కువగా కెమెరా దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తుందని కామెంట్స్ చేసింది. మొత్తానికి ఈ ఎపిసోడ్ మొత్తం కూడా రతిక చుట్టూ తిరిగింది.