షూటింగ్ లో నటి ఇబ్బంది..బాడీకి టీటీ!
వర్షంలో సాగే పాటల క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. భారీ వర్షంలో రొమాంటిక్ విరహ గీతాలు అద్బుతంగా చిత్రకరిస్తారు.
వర్షంలో సాగే పాటల క్రేజ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. భారీ వర్షంలో రొమాంటిక్ విరహ గీతాలు అద్బుతంగా చిత్రకరిస్తారు. అందులో తప్పకుండా హీరోయిన్ మాత్రం చీర..రవిక ధరించాల్సిందే. వర్షం పాటలు పండేవి కూడా హీరోయిన్ అలాంటి దుస్తుల్లో కనిపిస్తేనే. నాటి..మేటి మేకర్స్ ఇప్పటికీ ఆ విషయంలో అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. అయితే ఇలాంటి పాటల షూటింగ్ హీరోయిన్లకు మాత్రం చాలా ఇబ్బంది అనే చెప్పాలి.
వర్షంలో చీరధరించి తడిసి ముద్దయిన చీరలో డాన్సు చేయడం అంటే చాలా కష్టపడాల్సి వస్తోంది. స్పాట్ లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నో చెప్పకుండా చేయాల్సిందే. కానీ బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ మాత్రం అంతకు మించి చేసారని చెప్పాలి. బాలీవుడ్ సినిమా ‘మోహ్రా’లో ‘టిప్ టిప్ బరసా పానీ వర్షం పాటల్లో కల్లా ఓ సంచలనం. ఇందులో అక్షయ్ కుమార్-రవీనా టాండన్ జంటగా నటించారు.
ఈ పాట యావత్ దేశాన్ని ఓ ఊపు ఊపేసింది. రొమాంటిక్ గీతంలో రవీనా హాట్ పెర్పార్మెన్స్ అప్పట్లో ఓ సంచలనం. అయితే ఈ పాట చిత్రీకరణ సమయంలో రవీనా టాండన్ ఎంత ఇబ్బంది పెడిందో? తాజాగా ఇంటర్వ్యూలో రివీల్ చేసింది. కాలికి మేకులు సైతం గుచ్చుకున్నా! బోరున కురిసే వానలో ఎంతో కమిట్ మెంట్ తో ఆ పాటను పూర్తి చేసింది. `నిర్మాణంలో ఉన్న ఓ బిల్డింగ్‌లో ఆ పాటను షూట్ చేశారు. చుట్టూ ఇనుప చువ్వలు, అపరిశుభ్ర పరిసరాలు దీంతో కాళ్లకు చెప్పుల్లేకుండా పాట షూట్లో పాల్గొన్న నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది.
వర్షంలో చీర ధరించి అలాంటి మూమెంట్స్ చేయడం కోసం కష్టపడాల్సి వచ్చింది. డ్యాన్స్ చేస్తున్న ప్పుడు కాళ్లకు గాయాలు కాకుండా ఉండేందుకు నీ ప్యాడ్స్ వేసుకున్నా. ఇంటికి వెళ్లి చూసుకుంటే మోకాళ్లకు గాయాలయ్యాయి. చిన్నపాటి మేకులు లాంటివి గుచ్చుకున్నాయి. డాన్స్ చేస్తున్న సమయంలో పెద్దగా నొప్పి అనిపించలేదు. కానీ ఇంటికెళ్లి చూసే సరికి అవి తీవ్రమైన నొప్పికి దారి తీసాయి.
దీంతో వెంటనే డాక్టర్ ని సంప్రదించి టీటీ ఇంజెక్షన్ తీసుకున్నాను. జ్వరం కూడా వచ్చింది. కానీ ఆ పాట విజయం సాధించడంతో నా కష్టం ఇబ్బంది గా అనిపించలేదు. తెరపై కనిపించే గ్లామర్ వెనుక ఇలాంటి ఎన్నో కథలు ఉంటాయి. ఇన్ని ఇబ్బందులు పడ్డా పాటకు వచ్చిన రెస్పాన్స్‌కు మేము ఎంతో ఆనంద పడ్డాం` అని అన్నారు.